మైదుకూరులో ని మండల సివిల్ సప్లై గోడౌన్లనురాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ చిట్టిబోయిన సుబ్బరాయుడు యాదవ్ పర్యటించారు. మంగళవారం ఈ సందర్భంగా సివిల్ సప్లై గోడౌన్లలో జరుగుతున్న పలు అక్రమాలను గుర్తించారు. గోడౌన్ల నుంచి మధ్యాహ్న భోజన పథకానికి హాస్టళ్లకు అందించే బియ్యం బస్తాలను కొలతలు తగ్గించి అందిస్తున్నట్లు గుర్తించామన్నారు.గోడౌన్లలో ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలు పనిచేయకుండా చేయడమే కాకుండా కెమెరాలను వారి కదలికలను కనబడకుండా ఉండేట్లు అమర్చారని తెలిపారు. చెన్నూరు వద్ద ఉన్న ప్రధాన గోడౌన్లో ప్రొక్యూట్ మెంట్ కేంద్రాల నుంచి తీసుకున్న నాసిరకం బియ్యం లేదా పురుగు పట్టిన బియ్యాన్ని జిల్లా సివిల్ సప్లై అధికారులతో లాలూచీపడి రీసైక్లింగ్ చేసి అందిస్తున్నట్లు తీవ్రంగా ఆరోపించారు.రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో ఉన్నత ఉద్దేశాలతో విద్యార్థుల ఆరోగ్యాన్ని సంరక్షించడానికి పటిష్టమైన చర్యలు తీసుకుంటుంటే జిల్లా సివిల్ సప్లై అధికారులు లాలూచీపడి విద్యార్థుల ఆరోగ్యాలతో చలగాటమాడుతున్నారని మండిపడ్డారు. జిల్లా సివిల్ సప్లై అధికారులపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ను విద్యాశాఖ మంత్రి లోకేష్ ను కలుస్తానని తెలిపారు.

సివిల్ సప్లై గోడౌన్ లోను తనిఖీ చేసిన : స్టేట్ డైరెక్టర్ సుబ్బరాయుడు