ఉత్తరప్రదేశ్లో బ్రాహ్మణుల ప్రయోజనాలు బహుజన్ సమాజ్ పార్టీ ప్రభుత్వంలోనే భద్రంగా ఉంటాయని ఆ పార్టీ అధినేత్రి మాయావతి పేర్కొన్నారు. 2027 అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీ ఇప్పటికే బ్రాహ్మణ అభ్యర్థులను పెద్ద సంఖ్యలో రంగంలోకి దింపుతుండటంతో ప్రత్యర్థి పార్టీల్లో ఆందోళన నెలకొందని ఆమె వ్యాఖ్యానించారు. 2007 ఎన్నికల్లో బ్రాహ్మణుల మద్దతుతో బీఎస్పీ పూర్తి మెజారిటీ సాధించిన విషయాన్ని గుర్తుచేశారు. ‘సర్వజన హితాయ, సర్వజన సుఖాయ’ సిద్ధాంతంతోనే పార్టీ ముందుకు సాగుతుందని, అన్ని వర్గాలకు సమాన ప్రాధాన్యం కల్పిస్తుందని చెప్పారు. ఇతర పార్టీల పాలనలో అగ్రవర్ణాల ప్రజలు నిర్లక్ష్యానికి గురయ్యారని కూడా ఆమె ఆరోపించారు.

ఉత్తరప్రదేశ్లో బ్రాహ్మణుల ప్రయోజనాలు బీఎస్పీ పాలనలోనే భద్రం: మాయావతి