Wednesday, 24 June 2026
  • Home  
  • శ్రీకాళహస్తిలో భక్తిశ్రద్ధలతో మొహరం పీర్ల ఊరేగింపు
- తిరుపతి

శ్రీకాళహస్తిలో భక్తిశ్రద్ధలతో మొహరం పీర్ల ఊరేగింపు

శ్రీ కాళహస్తి, జూన్ 23, (పున్నమి న్యూస్) : శ్రీకాళహస్తి పట్టణంలో మొహరం పండుగను పురస్కరించుకుని శనివారం నాడు పీర్ల ఊరేగింపు ఉత్సవం అత్యంత భక్తిశ్రద్ధలు, కోలాహలం మధ్య వైభవంగా సాగింది. స్థానిక దర్గా నుండి ప్రారంభమైన ఈ భారీ ఊరేగింపు బీపీ అగ్రహారం వీధుల గుండా సాగింది. ఈ సందర్భంగా హిందూ ముస్లింలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్క భక్తుడు ఊరేగింపులో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేసి ఆశీర్వాదాలు పొందారు. మతసామరస్యానికి ప్రతీకగా నిలిచిన ఈ ఉత్సవంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దర్గా పీఠాధిపతి సయ్యద్ అహ్మద్ బాబా ఫరీద్, దర్గా ఉరుస్ కమిటీ సభ్యులు రాజేశ్వరరావు, ఓరుగంటి నాగేశ్వరరావు, రమేష్ బాబు, ఉదయ భాస్కర్ ముందస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతిభద్రతల పరిరక్షణ కోసం వన్ టౌన్ ఇన్చార్జి సీఐ నాగరాజు, వన్ టౌన్ ఎస్ఐ రామకృష్ణ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది భారీ బందోబస్తు నిర్వహించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. స్థానిక ప్రజలు, వివిధ వర్గాల ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరవడంతో శ్రీకాళహస్తి పురవీధులన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.