‘స్మార్ట్’ తిప్పలపై ‘రైతు’ ఆగ్రహం.. గొల్లపల్లి రైతు మల్లేష్ సర్కార్కు వార్నింగ్!
గ్యాస్ సిలిండర్ తరహాలోనే యూరియా పంపిణీ చేయాలి!
అధికారులు మొద్దు నిద్ర వీడకుంటే ‘మహా ధర్నా’ తప్పదు!
కామారెడ్డి, 22 జూన్, ( పున్నమి ప్రతినిధి ) :
దేశానికి వెన్నెముక అయిన రైతును ఏడిపించిన ఏ ప్రభుత్వమూ బాగుపడినట్లు చరిత్రలో లేదు! సాంకేతికత పేరిట అన్నదాతలను ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకునేది లేదని రామారెడ్డి మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన రైతు రెడ్డి మల్లేష్ ‘ప్రజా దర్బార్’ ముఖాముఖిలో ప్రభుత్వానికి, అధికారుల కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం అమ లవుతున్న యూరియా ఆన్లైన్ బుకింగ్ విధానం పై ఆయన నిప్పులు చెరిగారు.స్మార్ట్ ఫోన్లు అందరి కీ ఎక్కడివి? చదువురాని రైతుల గోస పట్టదా? అని గొల్లపల్లి రైతు మల్లేష్ పత్రిక ముఖంగా మాట్లా డుతూ, ప్రతి ఒక్క రైతు వద్ద పెద్ద పెద్ద స్మార్ట్ఫోన్లు ఉండవు. ఒకవేళ ఉన్నా, గ్రామాల్లో ఎంతోమంది రైతులకు చదువు రాదు. అలాంటిది యాప్లు డౌన్లోడ్ చేసుకుని, అందులో యూరియా బుక్ చేసుకోవాలంటే నానా తంటాలు పడాల్సి వస్తోంది. టెక్నాలజీ పేరిట రైతులను ముప్పు తిప్పలు పెట్టడం ఏమాత్రం న్యాయం కాదు అని ఆవేదన వ్యక్తం చేశారు.ఒకరికి దొరుకుతోంది.. ఇంకొకరికి దక్కడం లేదు! ఈ ఆన్లైన్ యాప్ లొసుగుల వల్ల కొందరు రైతులకు యూరియా సకాలంలో అందు తుంటే, మరికొందరు రైతులు దొరక్క నిరాశతో వెనుదిరుగుతున్నారు. ఈ వివక్ష, ఇబ్బందులు అన్నదాతల కడుపు కోతకు కారణమవుతున్నా యి. గ్యాస్ సిలిండర్ ఫార్ములా.. యూరియాకు ఎందుకు వర్తించదు? రైతు మల్లేష్ ప్రభుత్వానికి ఒక అద్భుతమైన, సరళమైన పరిష్కారాన్ని సూచించారు. దేశవ్యాప్తంగా ప్రతి ఇంటికీ గ్యాస్ సిలిండర్ ఏ విధంగా కేవలం ఒక టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేసి బుక్ చేసుకుంటున్నారో, యూరియాను కూడా అదే పద్ధతిలో అందించాలని డిమాండ్ చేశారు. ఫార్మర్ ఐడీ (Farmer ID): ప్రతి రైతుకు ఉన్న రిజిస్ట్రేషన్ ఐడీని ఆధారంగా చేసుకోవాలి.
ఒక్క కాల్తో బుకింగ్: టోల్ ఫ్రీ నెంబర్కు కేవలం ఒక్క ఫోన్ కాల్ చేస్తే యూరియా బుక్ అయ్యేలా సామాన్యుడికి అర్థమయ్యే సాంకేతికతను తీసుకు రావాలి. మూడు విడతలుగా పంపిణీ పంట కాలంలో రైతులకు అవసరమైన యూరియాను మూడు విడతలుగా నేరుగా అందించే బాధ్యతను ప్రభుత్వమే తీసుకోవాలి.అధికారుల అలసత్వం.. ‘యాప్’ల వైఫల్యం! జిల్లాలో కలెక్టర్, ఆర్డీఓ, తహసి ల్దార్, మండల వ్యవసాయ విస్తీర్ణ అధికారులు (AEO) క్షేత్రస్థాయిలో ఉన్నప్పటికీ, యాప్ల నిర్వ హణలో పంపిణీ పర్యవేక్షణలో సరైన సిబ్బంది లేకపోవడం కొసమెరుపు. ప్రభుత్వ యాప్లు సక్ర మంగా పనిచేయడం లేదని, తక్షణమే ఈ నిరుప యోగమైన యాప్ విధానాన్ని నిర్గుణం (రద్దు) చేయాలని మల్లేష్ డిమాండ్ చేశారు. తిరగబడితే తట్టుకోలేరు.. ‘మహా ధర్నా’కు సై! రైతుల సహనా న్ని పరీక్షించవద్దని మల్లేష్ హెచ్చరించారు. తక్షణ మే టోల్ ఫ్రీ నెంబర్ విధానాన్ని అమల్లోకి తెచ్చి, విడతల వారీగా యూరియా పంపిణీని సులభత రం చేయాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా రైతు లందరినీ ఏకం చేసి, పెద్ద ఎత్తున ‘మహా ధర్నా’ చేపడతామని సర్కారుకు అల్టిమేటం జారీ చేశా రు.రైతు గొంతుక వినిపించిన ఈ డిమాండ్లపై ఇప్ప టికైనా ఉన్నతాధికారులు, పాలకులు స్పందిస్తారో లేదో చూడాలి! మరి ???


