నెల్లూరు జిల్లా వరికుంటపాడు తహశీల్దార్ కార్యాలయం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
నెల్లూరు జిల్లా వరికుంటపాడు తహసిల్దార్ కార్యాలయం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పామూరు నుంచి నెల్లూరుకు వెళ్తున్న కారు, దుత్తలూరు నుంచి పామూరుకు నాలుగేళ్ల కుమారుడితో కలిసి బైక్పై ప్రయాణిస్తున్న దంపతులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భార్యాభర్తలతో పాటు నాలుగేళ్ల బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రులను ఉదయగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా దంపతులు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తీవ్రంగా గాయపడిన నాలుగేళ్ల బాలుడికి ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. మృతులను పామూరు మండలం బొట్లగూడూరు రఘునాథపురానికి చెందిన జయంపు వెంగయ్య, తిరుపతమ్మగా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసిన వరికుంటపాడు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


