Monday, 22 June 2026
  • Home  
  • ప్రజల గోడు వినేదెవరు..? కార్యదర్శి అందుబాటులో లేక ఏటికొప్పాకలో పేరుకుపోతున్న సమస్యలు..!
- అనకాపల్లి

ప్రజల గోడు వినేదెవరు..? కార్యదర్శి అందుబాటులో లేక ఏటికొప్పాకలో పేరుకుపోతున్న సమస్యలు..!

అనకాపల్లి జిల్లా , జూన్ 22 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్): యలమంచిలి మండలం ఏటికొప్పాక గ్రామంలో పంచాయతీ కార్యదర్శి అందుబాటులో లేకపోవడంతో ప్రజా సమస్యలు రోజురోజుకూ పెరుగుతున్నాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో డ్రైనేజీల శుభ్రత, రోడ్ల మరమ్మతులు, పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా, వీధి దీపాల సమస్యలు, జనన–మరణ ధ్రువపత్రాల జారీ, పన్నుల సంబంధిత సేవలు వంటి అనేక అంశాలు పెండింగ్‌లో ఉన్నాయని ప్రజలు చెబుతున్నారు. సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు కార్యదర్శిని కలిసే అవకాశం లేకపోవడంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని తెలిపారు. మండలంలో ప్రధాన పంచాయతీగా గుర్తింపు పొందిన ఏటికొప్పాకకు అవసరమైన పరిపాలనా సేవలు సకాలంలో అందకపోవడం పట్ల గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని వెంటనే పరిష్కరించే విధంగా పంచాయతీ వ్యవస్థను బలోపేతం చేయాలని, గ్రామానికి తగిన పరిపాలనా సేవలు అందేలా ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని గ్రామ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో జాప్యం కాకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

అనకాపల్లి జిల్లా , జూన్ 22 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్):
యలమంచిలి మండలం ఏటికొప్పాక గ్రామంలో పంచాయతీ కార్యదర్శి అందుబాటులో లేకపోవడంతో ప్రజా సమస్యలు రోజురోజుకూ పెరుగుతున్నాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో డ్రైనేజీల శుభ్రత, రోడ్ల మరమ్మతులు, పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా, వీధి దీపాల సమస్యలు, జనన–మరణ ధ్రువపత్రాల జారీ, పన్నుల సంబంధిత సేవలు వంటి అనేక అంశాలు పెండింగ్‌లో ఉన్నాయని ప్రజలు చెబుతున్నారు.
సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు కార్యదర్శిని కలిసే అవకాశం లేకపోవడంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని తెలిపారు. మండలంలో ప్రధాన పంచాయతీగా గుర్తింపు పొందిన ఏటికొప్పాకకు అవసరమైన పరిపాలనా సేవలు సకాలంలో అందకపోవడం పట్ల గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని వెంటనే పరిష్కరించే విధంగా పంచాయతీ వ్యవస్థను బలోపేతం చేయాలని, గ్రామానికి తగిన పరిపాలనా సేవలు అందేలా ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని గ్రామ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో జాప్యం కాకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.