శ్రీ కాళహస్తి, జూన్ 21, (పున్నమి న్యూస్) : శ్రీకాళహస్తి శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరస్వామి వారి ఆలయంలో భక్తుల రూపంలో వచ్చి కానుకలను అపహరించేందుకు యత్నించిన ఓ ఘరానా దొంగ ఆలయ సిబ్బందికి అడ్డంగా దొరికిపోయాడు. ఆలయ ప్రధాన హుండీ కానుకలతో నిండుగా ఉండటాన్ని గమనించిన సదరు వ్యక్తి, ఎవరికీ అనుమానం రాకుండా భక్తుడిలా నటిస్తూ హుండీలోని నగదును దొంగిలించడానికి ప్రయత్నించాడు. అయితే నిరంతరం అప్రమత్తంగా ఉండే ఆలయ నిఘా సిబ్బంది అతని కదలికలను గమనించి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతని వద్ద నుంచి సుమారు పదివేల రూపాయలకు పైగా దొంగిలించిన నగదును ఆలయ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం జరిపిన విచారణలో దొంగతనానికి పాల్పడిన వ్యక్తిని రాజమండ్రికి చెందినవాడిగా అధికారులు గుర్తించారు. ఆలయ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (SPF) అధికారులు నిందితుడిని వన్‌టౌన్ పోలీసులకు అప్పగించగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆలయ భద్రతను మరింత కట్టుదిట్టం చేసినట్లు అధికారులు ఈ సందర్భంగా వెల్లడించారు.

శ్రీకాళహస్తీశ్వరాలయ హుండీలో చోరీకి యత్నం-రాజమండ్రి దొంగ అరెస్ట్