శ్రీ కాళహస్తి, జూన్ 20, (పున్నమి న్యూస్) : సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండి, తనకున్న దానిలో కొంత భాగాన్ని అవసరమైన వారికి అందిస్తూ సేవా గుణాన్ని చాటుకుంటున్న బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోలా ఆనంద్ జీవితం ఆనందమయంగా, ఆయురారోగ్యాలతో కొనసాగాలని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆకాంక్షించారు. కోలా ఆనంద్ జన్మదినాన్ని పురస్కరించుకుని శనివారం స్థానిక ఎస్ఎస్ కళ్యాణ మండపంలో నిర్వహించిన ఎన్డీయే కూటమి రెండేళ్ల విజయోత్సవ సభలో ఆయనను ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఘనంగా సత్కరించారు. దుశ్శాలువా కప్పి, కేక్ కట్ చేయించి ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నాయకులు కోలా ఆనంద్ ప్రజాసేవా కార్యక్రమాలు, సామాజిక సేవలో ఆయన చూపుతున్న చొరవను కొనియాడారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు డాక్టర్ జి. దశరథాచారి, మిన్నల్ రవి, చెంచయ్య నాయుడు, గాలి చలపతి నాయుడు, డాక్టర్ ఎం. ఉమేష్ రావు, మోహన్ రెడ్డి, వజ్రం కిషోర్, మునిరాజా యాదవ్, ఖాదర్‌తో పాటు బీజేపీ నాయకులు కండ్రిగ ఉమ, అమర్ తదితరులు పాల్గొన్నారు.

కోలా ఆనంద్ సేవా స్పూర్తి ఆదర్శనీయం-ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి