కర్ణాటక శాసన మండలి ఎన్నికల్లో జరిగిన క్రాస్ ఓటింగ్ వ్యవహారం బీజేపీలో కలకలం రేపింది. ఈ అంశంపై వివరణ కోరుతూ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బి.వై. విజయేంద్ర, ప్రతిపక్ష నాయకుడు ఆర్. అశోక్ తదితర నేతలను పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ఢిల్లీకి పిలిపించారు. ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులకు చెందిన ఓట్లు ఇతర పార్టీలకు వెళ్లినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై రాష్ట్ర బీజేపీ ప్రత్యేక విచారణ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఈ ఘటన నేపథ్యంలో రాష్ట్ర పార్టీ నాయకత్వంలో మార్పులు జరిగే అవకాశమున్నట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

కర్ణాటక కౌన్సిల్ ఎన్నికల క్రాస్ ఓటింగ్‌పై బీజేపీ హైకమాండ్ ఆగ్రహం