ఐక్యరాజ్యసమితి వేదికగా భారత్ మరోసారి పాకిస్థాన్‌పై తీవ్ర విమర్శలు చేసింది. ఉగ్రవాదులకు ఆశ్రయం, శిక్షణ, మద్దతు ఇస్తున్న దేశంగా పాకిస్థాన్ వ్యవహరిస్తోందని భారత ప్రతినిధి అనుపమ సింగ్ పేర్కొన్నారు. జమ్మూ కాశ్మీర్‌పై పాకిస్థాన్ చేసిన వ్యాఖ్యలను భారత్ ఖండించింది. కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమని, పాకిస్థాన్ ఆక్రమణలో ఉన్న ప్రాంతాలే అసలు పరిష్కారం కావాల్సిన అంశమని స్పష్టం చేసింది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ, అదే ఉగ్రవాదం తనను తాను దెబ్బతీస్తే ఆశ్చర్యపడే ‘ఫ్రాంకెన్‌స్టైన్ రాష్ట్రం’గా పాకిస్థాన్ మారిందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయ వేదికపై చర్చకు దారితీశాయి.

ఐక్యరాజ్యసమితిలో పాకిస్థాన్‌పై భారత్ ఘాటు విమర్శలు