అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాల్లో ప్రభుత్వ ఉద్యోగులు తప్పనిసరిగా పాల్గొనాలంటూ జారీ చేసిన ఉత్తర్వుపై వచ్చిన వివాదానికి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఈ కార్యక్రమంలో పాల్గొనడం పూర్తిగా స్వచ్ఛందమని, హాజరు కాకపోతే ఎలాంటి శిక్షాత్మక చర్యలు ఉండవని కలకత్తా హైకోర్టుకు తెలిపింది. దీంతో హైకోర్టు కేసును ముగించింది. జూన్ 21న కోల్‌కతాలోని రెడ్ రోడ్‌లో జరిగే భారీ యోగా కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. 35,000 మందికి పైగా పాల్గొనే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఉద్యోగుల వ్యక్తిగత నిర్ణయాలను ప్రభుత్వం గౌరవిస్తుందని కోర్టులో స్పష్టం చేసింది.

యోగా దినోత్సవంలో పాల్గొనడం తప్పనిసరి కాదు: బెంగాల్ ప్రభుత్వం