శ్రీ కాళహస్తి, జూన్ 19, (పున్నమి న్యూస్) : ఉరుకుల పరుగుల జీవితంలో ప్రశాంతమైన, ఆహ్లాదకరమైన వాతావరణంలో అల్పాహారం చేయడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి పేర్కొన్నారు. యోగా సాధన కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం పార్టీ శ్రేణుల ఆహ్వానం మేరకు ఆయన శ్రీశుకబ్రహ్మాశ్రమం సమీపంలో ఉన్న క్యాంటీన్‌ను సందర్శించి అల్పాహారం స్వీకరించారు. ఈ సందర్భంగా క్యాంటీన్‌లో తయారుచేసిన ఇడ్లీ, మసాలా వడ, బోండా, దోసె వంటి సాంప్రదాయ వంటకాలను రుచి చూసిన ఎమ్మెల్యే, వాటి నాణ్యతను ప్రశంసించారు. అలాగే పరిశుభ్రమైన వాతావరణం, శుచిశుభ్రత పాటిస్తున్న తీరు, వినియోగదారులకు అందిస్తున్న సేవలను కొనియాడారు. స్థానిక ప్రజలకు నాణ్యమైన ఆహారాన్ని అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్న ఇటువంటి సంస్థలను ప్రోత్సహించడం అవసరమని ఆయన అన్నారు. ఎమ్మెల్యే తమ క్యాంటీన్‌ను సందర్శించి అల్పాహారం చేయడం పట్ల నిర్వాహకులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్డీయే కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

శ్రీశుకబ్రహ్మాశ్రమ సమీప క్యాంటీన్‌లో ఎమ్మెల్యే అల్పాహారం