సెంట్రల్ పార్క్ సమీపంలో ఘోర ప్రమాదం – పార్కింగ్‌లో ఉన్న కారును ఢీకొట్టిన లారీ, ఒకరు మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలోని సెంట్రల్ పార్క్ సమీపంలోని ఇల్లెందు క్రాస్ రోడ్ వద్ద గురువారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
సమాచారం ప్రకారం, భూపాలపల్లి నుంచి కొత్తగూడెం వైపు వస్తున్న మహీంద్రా ఎక్స్‌యూవీ కారు రోడ్డుపక్కన సైడ్ పార్కింగ్ చేసి ఇండికేటర్లు ఆన్ చేసి నిలిపి ఉంచారు. అయితే అదే సమయంలో వేగంగా వచ్చిన లారీ కారును బలంగా ఢీకొట్టింది… సమయం తెల్లవారుజామున@ 01.00am..
ఈ ప్రమాదంలో కారులో ఉన్న చిమల ఉపేందర్ (33) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు మణుగూరు ప్రాంతానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. కారులో మొత్తం ముగ్గురు ప్రయాణికులు ఉండగా, మిగిలిన ఇద్దరికి గాయాలైనట్లు సమాచారం.
ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఈ ఘటనతో మణుగూరు ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.


