అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద అభివృద్ధి చేసిన రాయనపాడు రైల్వే స్టేషన్‌ను కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి బుధవారం సందర్శించారు. స్టేషన్‌లో చేపట్టిన ఆధునికీకరణ పనులను పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రయాణికులకు అందుబాటులో ఉన్న సౌకర్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
రాయనపాడు రైల్వే స్టేషన్ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం మొత్తం రూ.19.90 కోట్ల నిధులు కేటాయించింది. తొలుత రూ.12.13 కోట్లతో పనులు ప్రారంభించగా, అనంతరం అదనపు సౌకర్యాలను కల్పిస్తూ ప్రాజెక్టు వ్యయాన్ని పెంచారు. ఈ నిధులతో స్టేషన్ భవనాన్ని ఆధునికీకరించడంతో పాటు విశాలమైన నిరీక్షణ మందిరాలు, డిజిటల్ ప్రయాణికుల సమాచార వ్యవస్థ, దివ్యాంగులకు అనుకూల సదుపాయాలు, ఆధునిక మరుగుదొడ్లు, తాగునీటి వసతి, పార్కింగ్ ప్రాంతం, సర్క్యులేటింగ్ ఏరియాను అభివృద్ధి చేశారు.
విమానాశ్రయాన్ని తలపించే ప్రధాన ప్రవేశ ద్వారం, విస్తృతమైన ప్లాట్‌ఫారమ్‌లు, ఏసీ వెయిటింగ్ హాల్స్, మెరుగైన లైటింగ్ వ్యవస్థ, పరిశుభ్రమైన వాతావరణంతో రాయనపాడు స్టేషన్ ఆకర్షణీయంగా మారింది. విజయవాడ రైల్వే స్టేషన్‌పై ఒత్తిడిని తగ్గించే ప్రత్యామ్నాయ రైల్వే కేంద్రంగా ఇది రూపుదిద్దుకుంటోందని అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా నందిగామ ఏఎంసీ చైర్మన్ పిట్టల శ్రీదేవి మాట్లాడుతూ, రాయనపాడు స్టేషన్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపిందన్నారు. కోట్లాది రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనుల వల్ల విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి పర్యటనతో ఈ ప్రాంత అభివృద్ధికి మరింత ప్రాధాన్యం లభిస్తుందన్నారు.

రాయనపాడు స్టేషన్‌కు కొత్త హంగులు రూ.19.90 కోట్లతో ఆధునికీకరణ.. పనులు పరిశీలించిన కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద అభివృద్ధి చేసిన రాయనపాడు రైల్వే స్టేషన్‌ను కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి బుధవారం సందర్శించారు. స్టేషన్‌లో చేపట్టిన ఆధునికీకరణ పనులను పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రయాణికులకు అందుబాటులో ఉన్న సౌకర్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాయనపాడు రైల్వే స్టేషన్ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం మొత్తం రూ.19.90 కోట్ల నిధులు కేటాయించింది. తొలుత రూ.12.13 కోట్లతో పనులు ప్రారంభించగా, అనంతరం అదనపు సౌకర్యాలను కల్పిస్తూ ప్రాజెక్టు వ్యయాన్ని పెంచారు. ఈ నిధులతో స్టేషన్ భవనాన్ని ఆధునికీకరించడంతో పాటు విశాలమైన నిరీక్షణ మందిరాలు, డిజిటల్ ప్రయాణికుల సమాచార వ్యవస్థ, దివ్యాంగులకు అనుకూల సదుపాయాలు, ఆధునిక మరుగుదొడ్లు, తాగునీటి వసతి, పార్కింగ్ ప్రాంతం, సర్క్యులేటింగ్ ఏరియాను అభివృద్ధి చేశారు. విమానాశ్రయాన్ని తలపించే ప్రధాన ప్రవేశ ద్వారం, విస్తృతమైన ప్లాట్‌ఫారమ్‌లు, ఏసీ వెయిటింగ్ హాల్స్, మెరుగైన లైటింగ్ వ్యవస్థ, పరిశుభ్రమైన వాతావరణంతో రాయనపాడు స్టేషన్ ఆకర్షణీయంగా మారింది. విజయవాడ రైల్వే స్టేషన్‌పై ఒత్తిడిని తగ్గించే ప్రత్యామ్నాయ రైల్వే కేంద్రంగా ఇది రూపుదిద్దుకుంటోందని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా నందిగామ ఏఎంసీ చైర్మన్ పిట్టల శ్రీదేవి మాట్లాడుతూ, రాయనపాడు స్టేషన్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపిందన్నారు. కోట్లాది రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనుల వల్ల విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి పర్యటనతో ఈ ప్రాంత అభివృద్ధికి మరింత ప్రాధాన్యం లభిస్తుందన్నారు.

