ఆంధ్రప్రదేశ్లోనే నెల్లూరు బీఎస్ఎన్ఎల్ (BSNL) సరికొత్త రికార్డు సృష్టించింది.నెల్లూరు బిఎస్ఎన్ఎల్ నెట్ వర్క్ రాష్ట్రంలో బి కేటగిరిలో నెంబర్ స్థానంలో ఉందని పార్లమెంటు సభ్యులు , టెలికాం అడ్వైజరీ కమిటీ ఛైర్మెన్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలిపారు. నెల్లూరులోని బిఎస్ఎన్ఎల్ ప్రధాన కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన టెలికాం అడ్వైజరీ కమిటీ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎంపీ మీడియాతో మాట్లాడుతూ.. టెలికాం అడ్వైజరీ కమిటీ సమావేశంలో అనేక టెలికాం సమస్యలను వారు చర్చించామన్నారు. గత సమావేశంలో టెలిఫోన్ అడ్వైజరీ కమిటీ సభ్యులు లేవనెత్తిన సమస్యలన్నిటిని అధికారులు పరిశీలించారన్నారు. చాలావాటికి జనరల్ మేనేజర్ శ్రీనివాసరావు సమాదానం కూడా తెలిపారన్నారు. జిల్లాలో నూతనంగా 28 సెల్ టవర్లు అందుబాటులోకి వచ్చాయన్నారు.82 సెల్ ఫోన్ టవర్లు నిర్మాణ దశలో ఉన్నాయన్నారు.ప్రత్యేకంగా ఉదయగిరి నియోజకవర్గంకు 34 సెల్ ఫోన్ టవర్లు ఏర్పాటుకు అనుమతులు వచ్చాయన్నారు. ప్రసుత్తం 60 శాతం అందుబాటు ఉన్నచోట మాత్రమే బిఎస్ఎన్ఎల్ టవర్లు ఏర్పాటు చేస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం 90 శాతం అందుబాటు ఉండే చోట కూడా సెల్ ఫోన్ టవర్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలో ఉందన్నారు. ప్రభుత్వం నుంచి అనుమతులు వస్తే బిఎస్ఎన్ఎల్ నెట్ వర్క్ సిగ్నల్స్ మరింత విస్తృతం అవుతాయన్నారు. గత రెండేళ్ల నుంచి జిల్లాలోని బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ లాభాలను ఉందన్నారు. గత ఏడాది రూ.48 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు.ఈ ఎడాది రూ. 49 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. గతంలో నష్టాల్లో ఉన్న బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ నేడు లాభాల్లో ఉందన్నారు. ఉద్యోగులు , సిబ్బంది బిఎస్ఎన్ఎల్ నెట్ వర్క్ ను తమ సొంతంగా భావించి పనిచేస్తున్నారన్నారు. జిల్లా టెలిఫోన్ అడ్వైజరీ కమిటీ సభ్యులు అందరం సంతోషంగా ఉన్నామని, తాను చైర్మన్ గా ఉన్న సమయంలో జిల్లాలో బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ ముందంజలో ఉండడం ఎంతో సంతోషదాయకమన్నారు. ఈ సమావేశంలో టెలికాం అడ్వైజరీ కమిటీ సభ్యులు, బిఎస్ఎన్ఎల్ అధికారులు పాల్గొన్నారు.

రాష్ట్రంలోనే నెల్లూరు BSNL నెంబర్ వన్.. ఎంపీ వేమిరెడ్డి!