పువ్వాడ నాగేంద్ర కుమార్
(పున్నమి జిల్లా రిపోర్టర్ )
సత్తుపల్లి, జూన్
భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకుడు పొంగులేటి సుధాకర్ రెడ్డి నేడు సత్తుపల్లిలో పర్యటించనున్నట్లు ఖమ్మం జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు భాష్కరుణి వీరాంరాజు తెలిపారు. ఈ సందర్భంగా సింగరేణి సంస్థకు సంబంధించిన పలు సమస్యలపై అధికారులను కలిసి చర్చించనున్నట్లు వెల్లడించారు. కార్మికులు, స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న అంశాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ పర్యటనను విజయవంతం చేయడానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని భాష్కరుణి వీరాంరాజు విజ్ఞప్తి చేశారు. సత్తుపల్లి ప్రాంతంలో పార్టీ బలోపేతానికి ఈ పర్యటన దోహదపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.



