Wednesday, 17 June 2026
  • Home  
  • సత్తుపల్లికి నేడు బీజేపీ జాతీయ నాయకుడు పొంగులేటి సుధాకర్ రెడ్డి
- ఖమ్మం

సత్తుపల్లికి నేడు బీజేపీ జాతీయ నాయకుడు పొంగులేటి సుధాకర్ రెడ్డి

పువ్వాడ నాగేంద్ర కుమార్ (పున్నమి జిల్లా రిపోర్టర్ ) సత్తుపల్లి, జూన్ భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకుడు పొంగులేటి సుధాకర్ రెడ్డి నేడు సత్తుపల్లిలో పర్యటించనున్నట్లు ఖమ్మం జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు భాష్కరుణి వీరాంరాజు తెలిపారు. ఈ సందర్భంగా సింగరేణి సంస్థకు సంబంధించిన పలు సమస్యలపై అధికారులను కలిసి చర్చించనున్నట్లు వెల్లడించారు. కార్మికులు, స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న అంశాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ పర్యటనను విజయవంతం చేయడానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని భాష్కరుణి వీరాంరాజు విజ్ఞప్తి చేశారు. సత్తుపల్లి ప్రాంతంలో పార్టీ బలోపేతానికి ఈ పర్యటన దోహదపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

పువ్వాడ నాగేంద్ర కుమార్
(పున్నమి జిల్లా రిపోర్టర్ )

సత్తుపల్లి, జూన్

భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకుడు పొంగులేటి సుధాకర్ రెడ్డి నేడు సత్తుపల్లిలో పర్యటించనున్నట్లు ఖమ్మం జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు భాష్కరుణి వీరాంరాజు తెలిపారు. ఈ సందర్భంగా సింగరేణి సంస్థకు సంబంధించిన పలు సమస్యలపై అధికారులను కలిసి చర్చించనున్నట్లు వెల్లడించారు. కార్మికులు, స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న అంశాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ పర్యటనను విజయవంతం చేయడానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని భాష్కరుణి వీరాంరాజు విజ్ఞప్తి చేశారు. సత్తుపల్లి ప్రాంతంలో పార్టీ బలోపేతానికి ఈ పర్యటన దోహదపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.