శ్రీకాళహస్తి, జూన్ 13, (పున్నమి న్యూస్) : శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారం, అర్హులైన ప్రతి కుటుంబానికి కూటమి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు సకాలంలో అందించడమే తమ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి తెలిపారు. క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వివిధ మండలాలు, గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలను నేరుగా కలిసి తాగునీరు, సాగునీరు, అంతర్గత రహదారులు, పెన్షన్లు, రేషన్ కార్డులు తదితర సమస్యలకు సంబంధించిన వినతులను స్వీకరించారు. సమస్యల తీవ్రతను బట్టి సంబంధిత శాఖల అధికారులతో అక్కడికక్కడే ఫోన్లో మాట్లాడి, త్వరితగతిన పరిష్కార చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ఎలాంటి నిర్లక్ష్యాన్నీ కూటమి ప్రభుత్వం సహించదని స్పష్టం చేసిన ఎమ్మెల్యే, ప్రతి వినతిని సానుకూలంగా పరిశీలించి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

ప్రజా సమస్యల పరిష్కారమే ప్రాధాన్యం-ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి