Friday, 12 June 2026
  • Home  
  • ప్రకృతి వ్యవసాయంతోనే రైతు ఆర్థికంగా అభివృద్ధి
- తిరుపతి

ప్రకృతి వ్యవసాయంతోనే రైతు ఆర్థికంగా అభివృద్ధి

రైతుచంద్రబాబు పున్నమి ప్రతినిధి, రామచంద్రపురం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రెండేళ్ల సంక్షేమం అభివృద్ధి కార్యక్రమంలో రైతు చంద్రబాబు ప్రస్తుత పరిస్థితుల్లో ప్రకృతి వ్యవసాయం తోనే రైతు ఆర్థికంగా ఎదగగలడు అన్నారు. రామచంద్రపురం మండలం నేతకుప్పం చంద్రబాబు మాట్లాడుతూ* రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకు గత 6 సంవత్సరాలుగా ప్రక్రుతి వ్యవసాయం చేస్తున్నానని, అగ్నిఅస్త్రం, బ్రహ్మాస్త్రం వంటి ప్రకృతి వ్యవసాయంలో ఉపయోగించే సహజ కీటక నియంత్రణ ద్రావణాలను వినియోగిస్తూ పంటలు పండించి, మిగిలిన ఉత్పత్తులను ఇతర రైతులకు అందజేస్తూ ప్రకృతి వ్యవసాయ విస్తరణకు కృషి చేస్తున్నానని అన్నారు. అన్నదాత – సుఖీభవ ద్వారా మొదటి విడతలో రూ.5 వేలు, పి.ఎం కిసాన్ ద్వారా రూ.2 వేలు, రెండవ విడతలో రూ.5 వేలు, మూడవ విడత రూ.4 వేలు, పిఎం కిసాన్ ద్వారా రూ. 6 వేలు నగదు జమ అయిందన్నారు. తాను వికలాంగుడునని ప్రభుత్వం వచ్చాక తనకు నెలకు రూ.6 వేలు వికలాంగుల పింఛన్ అందుతున్నదని, తన తల్లికి రూ.4 వేలు వృద్ధాప్య పెన్షన్ వస్తున్నదని, తద్వారా సంవత్సారానికి రూ.1.20 లక్షల లబ్ది కలుగుతోందని తెలిపారు. రైతులకు అండగా ఉంటున్న రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.

రైతుచంద్రబాబు

పున్నమి ప్రతినిధి, రామచంద్రపురం

ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రెండేళ్ల సంక్షేమం అభివృద్ధి కార్యక్రమంలో రైతు చంద్రబాబు ప్రస్తుత పరిస్థితుల్లో ప్రకృతి వ్యవసాయం తోనే రైతు ఆర్థికంగా ఎదగగలడు అన్నారు. రామచంద్రపురం మండలం నేతకుప్పం చంద్రబాబు మాట్లాడుతూ* రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకు గత 6 సంవత్సరాలుగా ప్రక్రుతి వ్యవసాయం చేస్తున్నానని, అగ్నిఅస్త్రం, బ్రహ్మాస్త్రం వంటి ప్రకృతి వ్యవసాయంలో ఉపయోగించే సహజ కీటక నియంత్రణ ద్రావణాలను వినియోగిస్తూ పంటలు పండించి, మిగిలిన ఉత్పత్తులను ఇతర రైతులకు అందజేస్తూ ప్రకృతి వ్యవసాయ విస్తరణకు కృషి చేస్తున్నానని అన్నారు. అన్నదాత – సుఖీభవ ద్వారా మొదటి విడతలో రూ.5 వేలు, పి.ఎం కిసాన్ ద్వారా రూ.2 వేలు, రెండవ విడతలో రూ.5 వేలు, మూడవ విడత రూ.4 వేలు, పిఎం కిసాన్ ద్వారా రూ. 6 వేలు నగదు జమ అయిందన్నారు. తాను వికలాంగుడునని ప్రభుత్వం వచ్చాక తనకు నెలకు రూ.6 వేలు వికలాంగుల పింఛన్ అందుతున్నదని, తన తల్లికి రూ.4 వేలు వృద్ధాప్య పెన్షన్ వస్తున్నదని, తద్వారా సంవత్సారానికి రూ.1.20 లక్షల లబ్ది కలుగుతోందని తెలిపారు. రైతులకు అండగా ఉంటున్న రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.