Friday, 12 June 2026
  • Home  
  • పోలీసు సిబ్బంది ఆరోగ్యానికి మొదటి ప్రాధాన్యం: సీపీ సునీల్ దత్…
- ఖమ్మం

పోలీసు సిబ్బంది ఆరోగ్యానికి మొదటి ప్రాధాన్యం: సీపీ సునీల్ దత్…

ఖమ్మం, జూన్ (పువ్వాడ నాగేంద్ర కుమార్ పున్నమి జిల్లా రిపోర్టర్ ) పోలీసు సిబ్బంది, వారి కుటుంబాల ఆరోగ్యానికి పోలీస్ శాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని సునీల్ దత్ తెలిపారు. ఖమ్మం ఏఆర్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో హైదరాబాద్‌కు చెందిన యశోద హాస్పిటల్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో పోలీసు సిబ్బందికి ఈసీజీ, టూ-డీ ఈకో గుండె వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ శిబిరాన్ని ప్రారంభించిన పోలీస్ కమిషనర్ సునీల్ దత్ మాట్లాడుతూ, ఆరోగ్యంగా ఉన్నప్పుడే విధులను సమర్థవంతంగా నిర్వహించగలుగుతారని, కుటుంబంలోనూ ప్రశాంత వాతావరణం నెలకొంటుందని పేర్కొన్నారు. పోలీసు విధుల్లో ఎదురయ్యే నిరంతర ఒత్తిడి కారణంగా గుండె సంబంధిత వ్యాధులు, ఇతర ప్రాణాంతక సమస్యలను ముందుగానే గుర్తించి నివారించేందుకు ప్రత్యేక వైద్య పరీక్షలను నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. ప్రముఖ ఆసుపత్రుల సహకారంతో ఉచిత మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి, సిబ్బందికి అవసరమైన ఆరోగ్య పరీక్షలు, ఆరోగ్య ప్రొఫైల్స్ అందిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో గుండె వైద్య నిపుణుడు భరత్ రెడ్డి, సీనియర్ మేనేజర్ వినయ్ కుమార్, ఎస్‌బీ ఏసీపీ మహేష్, ఏఆర్ ఏసీపీ సుశీల్ సింగ్, నర్సయ్య, ఆర్‌ఐలు కామరాజు, శ్రీశైలం, సురేష్ సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.

ఖమ్మం, జూన్
(పువ్వాడ నాగేంద్ర కుమార్
పున్నమి జిల్లా రిపోర్టర్ )

పోలీసు సిబ్బంది, వారి కుటుంబాల ఆరోగ్యానికి పోలీస్ శాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని సునీల్ దత్ తెలిపారు.

ఖమ్మం ఏఆర్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో హైదరాబాద్‌కు చెందిన యశోద హాస్పిటల్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో పోలీసు సిబ్బందికి ఈసీజీ, టూ-డీ ఈకో గుండె వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ శిబిరాన్ని ప్రారంభించిన పోలీస్ కమిషనర్ సునీల్ దత్ మాట్లాడుతూ, ఆరోగ్యంగా ఉన్నప్పుడే విధులను సమర్థవంతంగా నిర్వహించగలుగుతారని, కుటుంబంలోనూ ప్రశాంత వాతావరణం నెలకొంటుందని పేర్కొన్నారు.

పోలీసు విధుల్లో ఎదురయ్యే నిరంతర ఒత్తిడి కారణంగా గుండె సంబంధిత వ్యాధులు, ఇతర ప్రాణాంతక సమస్యలను ముందుగానే గుర్తించి నివారించేందుకు ప్రత్యేక వైద్య పరీక్షలను నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. ప్రముఖ ఆసుపత్రుల సహకారంతో ఉచిత మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి, సిబ్బందికి అవసరమైన ఆరోగ్య పరీక్షలు, ఆరోగ్య ప్రొఫైల్స్ అందిస్తున్నట్లు వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో గుండె వైద్య నిపుణుడు భరత్ రెడ్డి, సీనియర్ మేనేజర్ వినయ్ కుమార్, ఎస్‌బీ ఏసీపీ మహేష్, ఏఆర్ ఏసీపీ సుశీల్ సింగ్, నర్సయ్య, ఆర్‌ఐలు కామరాజు, శ్రీశైలం, సురేష్ సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.