-ముఖ్య అతిథులుగా పనబాక లక్ష్మి,కూరపాటి శంకర్ రెడ్డి హాజరు*
రాష్ట్ర ప్రభుత్వం గత రెండేళ్లలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు తెలుగుదేశం పార్టీ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన “2 ఏళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం” ఇంటింటి ప్రచార కార్యక్రమం మంగళవారం నాగలాపురం మండలంలోని కృష్ణాపురం గ్రామంలో నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి తిరుపతి పార్లమెంట్ జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి పనబాక లక్ష్మి గ, సత్యవేడు నియోజకవర్గ ప్రోగ్రాం కోఆర్డినేటర్ శ్రీ కూరపాటి శంకర్ రెడ్డి గారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఉదయం 9 గంటలకు గ్రామంలో ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించి, ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. అలాగే స్థానిక ప్రజల అభిప్రాయాలు, సమస్యలను తెలుసుకుని పార్టీ నాయకులకు తగిన సూచనలు అందించారు.
ఈ కార్యక్రమంలో క్లస్టర్, కో-క్లస్టర్, బూత్, కో-బూత్ ఇన్‌చార్జీలు, ఐటీడీపీ, తెలుగు యువత, అనుబంధ విభాగాల నాయకులు, రాష్ట్ర డైరెక్టర్లు, ఏఎంసీ, పీఏసీ ఛైర్మన్లు, డైరెక్టర్లు, యూనిట్ అధ్యక్షులు, కో-యూనిట్ ఇన్‌చార్జీలు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
కూటమి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఇంటికి చేర్చడమే ఈ కార్యక్రమం లక్ష్యమని, పార్టీ శ్రేణులంతా సమన్వయంతో పాల్గొని విజయవంతం చేయాలని నాగలాపురం మండల తెలుగుదేశం పార్టీ ఐటీడీపీ అధ్యక్షులు నరేంద్ర రెడ్డి పిలుపునిచ్చారు.
“ప్రతి ఇంటికి తెలుగుదేశం -ప్రతి కుటుంబానికి అభివృద్ధి సందేశం”, “ప్రతి కార్యకర్త ఒక సైనికుడు – ప్రతి బూత్‌లో విజయమే లక్ష్యం” అనే నినాదాలతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.


