గృహిణులు చేసే వేతనం లేని ఇంటి పనులకు కూడా ఆర్థిక విలువ ఉందని సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. రోడ్డు ప్రమాదాల్లో మరణించిన గృహిణుల కుటుంబాలకు పరిహారం లెక్కించే సమయంలో నెలకు కనీసం ₹30,000 ఆదాయంగా పరిగణించాలని ఆదేశించింది. గృహిణులు కుటుంబాన్ని మాత్రమే కాకుండా దేశ నిర్మాణంలో కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తారని కోర్టు పేర్కొంది. ‘హౌస్ వైఫ్’ అనే పదానికి బదులుగా ‘హోమ్ మేకర్’ అనే పదాన్ని ఉపయోగించాలని సూచించింది. ఈ మొత్తం ప్రతి మూడు సంవత్సరాలకు 10 శాతం పెంచాలని కూడా తెలిపింది. గృహిణి ఉద్యోగం చేస్తూనే ఇంటి బాధ్యతలు నిర్వహిస్తే, ఆమె జీతానికి అదనంగా ఈ మొత్తాన్ని పరిగణించాలని స్పష్టం చేసింది. మహిళల కృషికి సరైన గుర్తింపు ఇచ్చే దిశగా ఈ తీర్పు చారిత్రాత్మకమని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

గృహిణులు దేశ నిర్మాణంలో భాగస్వాములు: సుప్రీంకోర్టు