*మధ్యప్రదేశ్లో జరిగే కిక్ బాక్సింగ్ జాతీయ స్థాయి పోటీలో వెళుతున్న విద్యార్థిని అభినందిస్తున్న పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి డీకే అరుణ*
*పున్నమి ప్రతినిధి మహబూబ్నగర్ జిల్లా తేదీ 12/06/2026*
*ఈనెల 15వ తేదీ నుంచి వారం రోజులపాటు మధ్యప్రదేశ్లో జరుగుతున్న జాతీయ స్థాయికిక్ బాక్సింగ్ పోటీలో పాల్గొనడానికి మహబూబ్నగర్ నుంచి తిరుమల నాగేంద్ర కుమార్ కుమారుడు తిరుమల రేవంత్ వెళ్తున్న సందర్భంగా విద్యార్థిని పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి డీకే అరుణ గారు అభినందించడం జరిగింది. ఇలాంటి పథకాలలో జాతీయస్థాయి పోటీలో గెలుపొంది జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని వారు ఈ సందర్భంగా విద్యార్థిని అభినందించారు ఈ కార్యక్రమంలో రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్తు రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఎం ఎన్ విజయకుమార్, తెలంగాణ గజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు పి .మురళీకృష్ణ మరియు, విద్యార్థి తండ్రి రచయిత ,గాయకుడు, తిరుమల నాగేంద్రకుమార్ ఉన్నారు


