నెల్లూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎన్నికల హామీలైన సూపర్ సిక్స్, ఆడబిడ్డ నిధి, తల్లికి వందనం, ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. రైతులు, మహిళలు, నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మహానాడులో కూడా జగన్ గురించే మాట్లాడారని, జగనన్న పేరు ప్రస్తావించకుండా టీడీపీ ఒక్క కార్యక్రమం నిర్వహించలేదని వ్యాఖ్యానించారు. :::

జగనన్న పేరు లేకుండా టీడీపీకి రోజు గడవదు: కాకాణి పూజిత