Thursday, 11 June 2026
  • Home  
  • జనగామ జిల్లా లో టీఆర్పి లో భారీ చేరికలు, రాజకీయ పార్టీలకు భారీ షాక్
- జనగాం

జనగామ జిల్లా లో టీఆర్పి లో భారీ చేరికలు, రాజకీయ పార్టీలకు భారీ షాక్

*జనగామ జిల్లాలో ప్రధాన పార్టీలకు భారీ షాక్..!* ————————————- జనగామ, జూన్ 11,పున్నమి ప్రతినిధి : తెలంగాణ రాజ్యాధికార పార్టీలో భారీ చేరికలు అగ్రవర్ణాల పాలనకు చరమగీతం పాడుతాం – రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాధం రజిని కుమార్ యాదవ్– జూలై 5న భువనగిరిలో జరిగే రాజ్యాధికార సమరభేరికి జనగామ జిల్లా నుంచి 10 వేల మందిని తరలించాలి – జిల్లా అధ్యక్షులు కట్ల సదానందం* జనగామ జిల్లా అధ్యక్షులు కట్ల సదానందం ఆధ్వర్యంలో జిల్లా *ముఖ్య నాయకుల సమావేశం* ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ *మాధం రజిని కుమార్ యాదవ్* ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా *వివిధ రాజకీయ పార్టీలకు* చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు తెలంగాణ రాజ్యాధికార పార్టీ *సిద్ధాంతాలకు* ఆకర్షితులై పార్టీ కండువా కప్పుకుని టీఆర్పీలో చేరారు. వారిని మాధం రజిని కుమార్ యాదవ్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాధం *రజిని కుమార్ యాదవ్ మాట్లాడుతూ* తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు రాజకీయంగా తగిన ప్రాధాన్యత దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో దశాబ్దాలుగా కొనసాగుతున్న అగ్రవర్ణాల రాజకీయ ఆధిపత్యాన్ని అంతం చేసి, అణగారిన వర్గాలకు రాజ్యాధికారం అందించడమే తెలంగాణ రాజ్యాధికార పార్టీ లక్ష్యమని స్పష్టం చేశారు. రాష్ట్ర సంపదను సృష్టించే బహుజన వర్గాలకే రాజకీయ అధికారం దక్కాలని, అదే *సామాజిక న్యాయానికి* నిజమైన నిర్వచనమని పేర్కొన్నారు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు ఐక్యంగా నిలిస్తే తెలంగాణ రాజకీయాల్లో చారిత్రాత్మక మార్పు తీసుకురావడం ఖాయమన్నారు. జనగామ జిల్లా అధ్యక్షులు *కట్ల సదానందం* మాట్లాడుతూ జూలై 5న భువనగిరిలో జరిగే *”రాజ్యాధికార సమరభేరి”* సభను చారిత్రాత్మక విజయంగా నిలపాలని పిలుపునిచ్చారు. జనగామ జిల్లా నుంచి కనీసం 10 వేల మందిని సభకు తరలించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు. సభ విజయవంతం కోసం జిల్లా నాయకులు, మండల నాయకులకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు. *ప్రతి మండలానికి ఒక ఇంచార్జిని* నియమిస్తూ ఉద్యమాన్ని గ్రామ స్థాయికి తీసుకెళ్లాలని సూచించారు. సభ ప్రచారం, ప్రజల సమీకరణ, రవాణా ఏర్పాట్లు, సోషల్ మీడియా ప్రచారం వంటి అంశాలపై నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తున్న పలువురు నాయకులకు నియామక పత్రాలు అందజేశారు. పార్టీ అభివృద్ధికి అంకితభావంతో పనిచేసి రాజ్యాధికార లక్ష్య సాధనలో భాగస్వాములు కావాలని నాయకత్వం పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు పోలు రాజు, కృష్ణ, సౌత్ సోషల్ మీడియా కన్వీనర్ మార్త శ్రీనివాస్, హన్మకొండ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పూజారి సత్యనారాయణ,జనగామ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ జిట్టబోయిన నరేష్, ఉపాధ్యక్షులు రేణుకుంట్ల మురళి, బోడ రమేష్, కార్యదర్శి బుక్క విష్ణువర్ధన్,యూత్ అధ్యక్షులు పిట్టల సురేష్ ,యూత్ ప్రధాన కార్యదర్శి చెన్నూరు వంశీ, మైనారిటీ సెల్ అధ్యక్షులు బబ్లు( యాకుబ్ పాషా), ఎస్సీ సెల్ అధ్యక్షులు పొనుగంటి నర్సింగరావు ,యూత్ టౌన్ అధ్యక్షులు పొన్నగంటి కృష్ణ, సోషల్ మీడియా కన్వీనర్ కుకూడాల కిరణ్ కుమార్, వివిధ మండల అధ్యక్షులు నీల లింగం ,మహిళా అధ్యక్షురాలు దండు రాణి ,మైనారిటీ సెల్ టౌన్ అధ్యక్షులు ఎండి పాషా పాల్గొన్నారు.

*జనగామ జిల్లాలో ప్రధాన పార్టీలకు భారీ షాక్..!*
————————————-
జనగామ, జూన్ 11,పున్నమి ప్రతినిధి :
తెలంగాణ రాజ్యాధికార పార్టీలో భారీ చేరికలు అగ్రవర్ణాల పాలనకు చరమగీతం పాడుతాం – రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాధం రజిని కుమార్ యాదవ్–
జూలై 5న భువనగిరిలో జరిగే రాజ్యాధికార సమరభేరికి జనగామ జిల్లా నుంచి 10 వేల మందిని తరలించాలి – జిల్లా అధ్యక్షులు కట్ల సదానందం*
జనగామ జిల్లా అధ్యక్షులు కట్ల సదానందం ఆధ్వర్యంలో జిల్లా *ముఖ్య నాయకుల సమావేశం* ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ *మాధం రజిని కుమార్ యాదవ్* ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా *వివిధ రాజకీయ పార్టీలకు* చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు తెలంగాణ రాజ్యాధికార పార్టీ *సిద్ధాంతాలకు* ఆకర్షితులై పార్టీ కండువా కప్పుకుని టీఆర్పీలో చేరారు. వారిని మాధం రజిని కుమార్ యాదవ్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మాధం *రజిని కుమార్ యాదవ్ మాట్లాడుతూ* తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు రాజకీయంగా తగిన ప్రాధాన్యత దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో దశాబ్దాలుగా కొనసాగుతున్న అగ్రవర్ణాల రాజకీయ ఆధిపత్యాన్ని అంతం చేసి, అణగారిన వర్గాలకు రాజ్యాధికారం అందించడమే తెలంగాణ రాజ్యాధికార పార్టీ లక్ష్యమని స్పష్టం చేశారు.
రాష్ట్ర సంపదను సృష్టించే బహుజన వర్గాలకే రాజకీయ అధికారం దక్కాలని, అదే *సామాజిక న్యాయానికి* నిజమైన నిర్వచనమని పేర్కొన్నారు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు ఐక్యంగా నిలిస్తే తెలంగాణ రాజకీయాల్లో చారిత్రాత్మక మార్పు తీసుకురావడం ఖాయమన్నారు.
జనగామ జిల్లా అధ్యక్షులు *కట్ల సదానందం* మాట్లాడుతూ జూలై 5న భువనగిరిలో జరిగే *”రాజ్యాధికార సమరభేరి”* సభను చారిత్రాత్మక విజయంగా నిలపాలని పిలుపునిచ్చారు. జనగామ జిల్లా నుంచి కనీసం 10 వేల మందిని సభకు తరలించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు.
సభ విజయవంతం కోసం జిల్లా నాయకులు, మండల నాయకులకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు. *ప్రతి మండలానికి ఒక ఇంచార్జిని* నియమిస్తూ ఉద్యమాన్ని గ్రామ స్థాయికి తీసుకెళ్లాలని సూచించారు. సభ ప్రచారం, ప్రజల సమీకరణ, రవాణా ఏర్పాట్లు, సోషల్ మీడియా ప్రచారం వంటి అంశాలపై నాయకులకు దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తున్న పలువురు నాయకులకు నియామక పత్రాలు అందజేశారు. పార్టీ అభివృద్ధికి అంకితభావంతో పనిచేసి రాజ్యాధికార లక్ష్య సాధనలో భాగస్వాములు కావాలని నాయకత్వం పిలుపునిచ్చింది.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు పోలు రాజు, కృష్ణ, సౌత్ సోషల్ మీడియా కన్వీనర్ మార్త శ్రీనివాస్, హన్మకొండ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పూజారి సత్యనారాయణ,జనగామ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ జిట్టబోయిన నరేష్, ఉపాధ్యక్షులు రేణుకుంట్ల మురళి, బోడ రమేష్, కార్యదర్శి బుక్క విష్ణువర్ధన్,యూత్ అధ్యక్షులు పిట్టల సురేష్ ,యూత్ ప్రధాన కార్యదర్శి చెన్నూరు వంశీ, మైనారిటీ సెల్ అధ్యక్షులు బబ్లు( యాకుబ్ పాషా), ఎస్సీ సెల్ అధ్యక్షులు పొనుగంటి నర్సింగరావు ,యూత్ టౌన్ అధ్యక్షులు పొన్నగంటి కృష్ణ, సోషల్ మీడియా కన్వీనర్ కుకూడాల కిరణ్ కుమార్, వివిధ మండల అధ్యక్షులు నీల లింగం ,మహిళా అధ్యక్షురాలు దండు రాణి ,మైనారిటీ సెల్ టౌన్ అధ్యక్షులు ఎండి పాషా పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.