Wednesday, 10 June 2026
  • Home  
  • ఓటు హక్కు పరిరక్షణకు బీఎల్‌వోలు కృషి చేయాలి: తాసిల్దార్ రమాదేవి
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఓటు హక్కు పరిరక్షణకు బీఎల్‌వోలు కృషి చేయాలి: తాసిల్దార్ రమాదేవి

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూన్ 10 (పున్నమి ప్రతినిధి) మనుబోలు, జూన్ 10: ఓటర్ల ఓటు హక్కు పరిరక్షణే లక్ష్యంగా బీఎల్‌వోలు సమర్థవంతంగా పనిచేయాలని తాసిల్దార్ రమాదేవి సూచించారు. బుధవారం స్థానిక రెవెన్యూ కార్యాలయంలో బీఎల్‌వోలు, సూపర్వైజర్లకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆధ్వర్యంలో ఈ శిక్షణ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇంటింటి సర్వే ద్వారా కొత్త ఓటర్ల నమోదు, పేర్ల తొలగింపు, మార్పులకు సంబంధించిన దరఖాస్తులను సక్రమంగా స్వీకరించాలని సూచించారు. ఓటరు వివరాలను డిజిటల్ రూపంలో నమోదు చేయడంతో పాటు ఫోటోల నాణ్యతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని చెప్పారు. కార్యక్రమంలో డిప్యూటీ తాసిల్దార్ ప్రదీప్ కుమార్, ఆర్‌ఐ అరుణ్ తేజ్ పాల్గొన్నారు.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూన్ 10 (పున్నమి ప్రతినిధి)
మనుబోలు, జూన్ 10: ఓటర్ల ఓటు హక్కు పరిరక్షణే లక్ష్యంగా బీఎల్‌వోలు సమర్థవంతంగా పనిచేయాలని తాసిల్దార్ రమాదేవి సూచించారు. బుధవారం స్థానిక రెవెన్యూ కార్యాలయంలో బీఎల్‌వోలు, సూపర్వైజర్లకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆధ్వర్యంలో ఈ శిక్షణ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇంటింటి సర్వే ద్వారా కొత్త ఓటర్ల నమోదు, పేర్ల తొలగింపు, మార్పులకు సంబంధించిన దరఖాస్తులను సక్రమంగా స్వీకరించాలని సూచించారు. ఓటరు వివరాలను డిజిటల్ రూపంలో నమోదు చేయడంతో పాటు ఫోటోల నాణ్యతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని చెప్పారు. కార్యక్రమంలో డిప్యూటీ తాసిల్దార్ ప్రదీప్ కుమార్, ఆర్‌ఐ అరుణ్ తేజ్ పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.