Friday, 24 July 2026
  • Home  
  • కోటపాడు జెడ్పీ హైస్కూల్‌లో అదనపు తరగతి గదులను ప్రారంభించిన ఎమ్మెల్యే నల్లమిల్లి
- తూర్పు గోదావరి

కోటపాడు జెడ్పీ హైస్కూల్‌లో అదనపు తరగతి గదులను ప్రారంభించిన ఎమ్మెల్యే నల్లమిల్లి

అనపర్తి, జూలై 23 (రమేష్ నాయుడు – పున్నమి ప్రతినిధి): రంగంపేట మండలం కోటపాడు జెడ్పీ హైస్కూల్‌లో దాతల సౌజన్యంతో రూ.2.50 లక్షల వ్యయంతో నిర్మించిన రెండు అదనపు తరగతి గదులను అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించడంతో పాటు మౌలిక సదుపాయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. విద్యా వికాసంలో దాతల భాగస్వామ్యం అభినందనీయమని, సమాజ సహకారంతో ప్రభుత్వ పాఠశాలలు మరింత అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రంగంపేట మండల కూటమి నాయకులు, కోటపాడు గ్రామ కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

అనపర్తి, జూలై 23 (రమేష్ నాయుడు  పున్నమి ప్రతినిధి):
రంగంపేట మండలం కోటపాడు జెడ్పీ హైస్కూల్‌లో దాతల సౌజన్యంతో రూ.2.50 లక్షల వ్యయంతో నిర్మించిన రెండు అదనపు తరగతి గదులను అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించడంతో పాటు మౌలిక సదుపాయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. విద్యా వికాసంలో దాతల భాగస్వామ్యం అభినందనీయమని, సమాజ సహకారంతో ప్రభుత్వ పాఠశాలలు మరింత అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో రంగంపేట మండల కూటమి నాయకులు, కోటపాడు గ్రామ కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.