తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం చిట్వేల్ మండలంలో పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ నేడు ఉదయం 10 గంటలకు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సర్కిల్ వద్ద రాస్తారోకో కార్యక్రమం నిర్వహించనున్నట్లు సిపిఐ, సిపిఎం, సిపిఐ(ఎంఎల్) తదితర వామపక్ష పార్టీలు ప్రకటించాయి.
ఈ సందర్భంగా సిపిఐ రైల్వే కోడూరు నియోజకవర్గ కార్యదర్శి జ్యోతి చిన్నయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వరుసగా ఇంధన ధరలను పెంచడం వల్ల సామాన్య ప్రజలపై తీవ్ర ఆర్థిక భారం పడుతోందని ఆరోపించారు. ఇంధన ధరల పెంపుతో రవాణా వ్యయాలు, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.
పెరిగిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ నిర్వహిస్తున్న ఈ రాస్తారోకోలో ప్రజలు, రైతులు, ఆటో, జీప్ డ్రైవర్లు, లారీ యజమానులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వామపక్ష పార్టీలు పిలుపునిచ్చాయి. కార్యక్రమంలో కటారి గోపాల్, తిప్పన ప్రసాద్, సిద్ధారప రవి, సామ గంగయ్య తదితర నాయకులు పాల్గొన్నారు.

ఇంధన ధరల పెంపుపై నేడు చిట్వేల్‌లో రాస్తారోకో
తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం చిట్వేల్ మండలంలో పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ నేడు ఉదయం 10 గంటలకు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సర్కిల్ వద్ద రాస్తారోకో కార్యక్రమం నిర్వహించనున్నట్లు సిపిఐ, సిపిఎం, సిపిఐ(ఎంఎల్) తదితర వామపక్ష పార్టీలు ప్రకటించాయి. ఈ సందర్భంగా సిపిఐ రైల్వే కోడూరు నియోజకవర్గ కార్యదర్శి జ్యోతి చిన్నయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వరుసగా ఇంధన ధరలను పెంచడం వల్ల సామాన్య ప్రజలపై తీవ్ర ఆర్థిక భారం పడుతోందని ఆరోపించారు. ఇంధన ధరల పెంపుతో రవాణా వ్యయాలు, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. పెరిగిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ నిర్వహిస్తున్న ఈ రాస్తారోకోలో ప్రజలు, రైతులు, ఆటో, జీప్ డ్రైవర్లు, లారీ యజమానులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వామపక్ష పార్టీలు పిలుపునిచ్చాయి. కార్యక్రమంలో కటారి గోపాల్, తిప్పన ప్రసాద్, సిద్ధారప రవి, సామ గంగయ్య తదితర నాయకులు పాల్గొన్నారు.

