మణిపూర్‌లో జనాభా గణన నిర్వహించే ముందు జాతీయ పౌరుల నమోదు (NRC) నవీకరణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది ఇంఫాల్‌లో భారీ ర్యాలీ నిర్వహించారు. పలు పౌరసంఘాల ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో అక్రమ వలసదారులను గుర్తించి దేశం నుంచి పంపించాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. ఎన్ఆర్సీ నవీకరణ లేకుండా జనాభా గణన చేపట్టవద్దని నినాదాలు చేశారు. రాష్ట్రంలో అక్రమ వలసలు, సరిహద్దు భద్రత వంటి అంశాలు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయని నిర్వాహకులు తెలిపారు. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని ర్యాలీలో పాల్గొన్నవారు కోరారు.

మణిపూర్‌లో ఎన్ఆర్సీ నవీకరణకు వేలాది మంది ర్యాలీ