కేరళ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని జూన్ 15 నుంచి అమలు చేయనుంది. తొలి 100 రోజుల పాటు ఈ పథకం సాధారణ ఆర్డినరీ బస్సుల్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. అనంతరం ప్రయాణికుల అవసరాలు, ఆర్థిక ప్రభావాన్ని అధ్యయనం చేసి ఫాస్ట్, సూపర్ ఫాస్ట్ బస్సులకు కూడా విస్తరించే అంశాన్ని పరిశీలించనున్నారు. యూడీఎఫ్ ఎన్నికల హామీల్లో భాగంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఈ నిర్ణయం వల్ల కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థపై గణనీయమైన ఆర్థిక భారం పడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయినప్పటికీ మహిళల ప్రయాణ వ్యయాన్ని తగ్గించి, వారి ఆర్థిక స్వావలంబనకు తోడ్పడటమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రులు తెలిపారు.

కేరళలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభం