Wednesday, 10 June 2026
  • Home  
  • భారత్ అణ్వాయుధ నిల్వలు పెరిగాయి: SIPRI నివేదిక
- Featured

భారత్ అణ్వాయుధ నిల్వలు పెరిగాయి: SIPRI నివేదిక

భారత్ 2025లో తన అణ్వాయుధ నిల్వలను స్వల్పంగా పెంచినట్లు స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (SIPRI) వెల్లడించింది. 2025లో సుమారు 180 అణ్వాయుధాలు ఉన్న భారత్ వద్ద 2026 ప్రారంభానికి 190 వార్‌హెడ్లు ఉన్నట్లు అంచనా వేసింది. చైనా వరకు చేరగల దీర్ఘశ్రేణి క్షిపణుల అభివృద్ధిపై భారత్ ఎక్కువ దృష్టి పెట్టిందని నివేదిక పేర్కొంది. పాకిస్థాన్‌తో కొనసాగుతున్న భద్రతా సవాళ్లను దృష్టిలో ఉంచుకొని అణు సామర్థ్యాల ఆధునికీకరణ కొనసాగుతోందని తెలిపింది. 2025లో భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన ‘ఆపరేషన్ సిందూర్’ను అత్యంత తీవ్రమైన సైనిక సంక్షోభంగా SIPRI అభివర్ణించింది. ప్రపంచంలో అత్యధిక రక్షణ వ్యయం చేసే దేశాల్లో భారత్ ఐదో స్థానంలో నిలిచిందని కూడా నివేదిక వెల్లడించింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.