భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత కీర్తిశేషులు చండ్ర రాజేశ్వరరావు 112వ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని కొండాపూర్ సీఆర్ ఫౌండేషన్‌లో సోమవారం ఘనంగా జయంతి సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కే. శ్రీనివాసరెడ్డి, సీఆర్ ఫౌండేషన్ గౌరవాధ్యక్షులు డాక్టర్ కే. నారాయణ, అధ్యక్షులు ముప్పాళ్ల నాగేశ్వరరావు తదితరులు పాల్గొని చండ్ర రాజేశ్వరరావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం “యువత, నెటిజెన్స్ ఎటువైపు” అంశంపై కే. శ్రీనివాసరెడ్డి స్మారక ఉపన్యాసం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పీజే చంద్రశేఖరరావు, ఈ. చెన్నకేశవులు, కే. రజిని, జే. కల్పన, నిమ్మరాజు చలపతిరావు తదితర ప్రముఖులు పాల్గొన్నారు.



