సర్వేపల్లి: సర్వేపల్లి నియోజకవర్గంలోని వెంకటాచలం, ముత్తుకూరు, తోటపల్లిగూడూరు, మనుబోలు మండలాల్లో నిర్వహించిన ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎన్నికల హామీల ప్రతులను దగ్ధం చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. వెంకటాచలం మండలంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత రెడ్డి పాల్గొని ప్రసంగించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. ప్రజా సమస్యల పరిష్కారం, హామీల అమలు కోసం వైసీపీ ఆధ్వర్యంలో ఉద్యమాలు కొనసాగుతాయని నాయకులు తెలిపారు. కార్యక్రమానికి హాజరైన ప్రజలకు పార్టీ నేతలు కృతజ్ఞతలు తెలియజేశారు.

వెన్నుపోటుకు రెండేళ్లు.. సర్వేపల్లిలో వైసీపీ నిరసనలు