ఖరీఫ్ సీజన్‌లో విత్తనాలు కొనుగోలు చేసే రైతులు రశీదు తప్పనిసరిగా తీసుకోవాలి : జిల్లా వ్యవసాయాధికారి యశ్వంత్ రావు విత్తనాల రశీదులో లాట్ నంబర్, వ్యాపారి సంతకం, రైతు సంతకం తప్పనిసరిగా ఉండాలిపంట కాలం పూర్తయ్యే వరకు కొనుగోలు రశీదులను భద్రంగా దాచుకోవాలని సూచనవిత్తనాలతో పాటు ఎరువులు, పురుగుమందులు కొనుగోలు చేసినా రశీదు తీసుకోవాలిమండల కేంద్రంలోని పలు వ్యవసాయ దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన డీఏఓజిల్లా వ్యాప్తంగా గడ్డి నివారణ మందుల అమ్మకాలు తాత్కాలికంగా నిలిపివేతగడ్డి మందులు అవసరమైన రైతులు మండల వ్యవసాయాధికారి అనుమతి పత్రం పొందాలిఅనుమతి లేకుండా గడ్డి మందుల విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తప్పవుఎక్కడైనా రహస్యంగా గడ్డి మందుల అమ్మకాలు జరిగితే వెంటనే వ్యవసాయ శాఖకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి నాణ్యమైన విత్తనాల వినియోగంతో పాటు కొనుగోలు ఆధారాలను భద్రపరచుకోవాలని రైతులకు సూచన.


