మద్యం, ఇతర మత్తు పదార్థాలకు బానిసై కుటుంబాలకు, సమాజానికి ఇబ్బందులు కలిగిస్తున్న వ్యక్తులను తిరిగి సాధారణ జీవన విధానంలోకి తీసుకురావాలనే లక్ష్యంతో పెందుర్తి పోలీసులు మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
పెందుర్తి పోలీస్ స్టేషన్ అధికారి కె.వి. సతీష్ కుమార్ ఆధ్వర్యంలో, కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు మత్తుకు బానిసైన ఒక వ్యక్తిని పునరావాస కేంద్రంలో చేర్పించారు.
పెందుర్తి జెఎన్‌ఎన్‌యూఆర్‌ఎం కాలనీకి చెందిన నూతలపాటి తేజ మూర్తి మద్యానికి బానిసై కుటుంబ సభ్యులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నారని వారి కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. దీనిపై వెంటనే స్పందించిన పోలీసు సిబ్బంది, కుటుంబ సభ్యుల సహకారంతో ఆయనను చినముషిడివాడలోని న్యూ లైఫ్ మత్తు విముక్తి పునరావాస కేంద్రంలో చేర్పించి చికిత్స అందేలా చర్యలు చేపట్టారు.
ఈ సందర్భంగా పెందుర్తి పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, మద్యం, గంజాయి లేదా ఇతర మత్తు పదార్థాలకు బానిసై బాధపడుతున్న కుటుంబాల్లో ఎవరికైనా చికిత్స అవసరమైతే భయపడకుండా పోలీసులను సంప్రదించాలని సూచించారు. కుటుంబ సభ్యులు స్వచ్ఛందంగా సహాయం కోరిన వెంటనే స్పందించి, అవసరమైన సహకారం అందించి సంబంధిత పునరావాస కేంద్రాల్లో చేర్పించేందుకు పూర్తి సహాయం అందిస్తామని తెలిపారు.
మత్తు పదార్థాలకు దూరంగా ఉండటం ద్వారా కుటుంబ బంధాలు కాపాడబడతాయని, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పెందుర్తి పోలీసులు పిలుపునిచ్చారు.

మత్తు బారిన పడిన వారికి పెందుర్తి పోలీసుల చేయూత
మద్యం, ఇతర మత్తు పదార్థాలకు బానిసై కుటుంబాలకు, సమాజానికి ఇబ్బందులు కలిగిస్తున్న వ్యక్తులను తిరిగి సాధారణ జీవన విధానంలోకి తీసుకురావాలనే లక్ష్యంతో పెందుర్తి పోలీసులు మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పెందుర్తి పోలీస్ స్టేషన్ అధికారి కె.వి. సతీష్ కుమార్ ఆధ్వర్యంలో, కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు మత్తుకు బానిసైన ఒక వ్యక్తిని పునరావాస కేంద్రంలో చేర్పించారు. పెందుర్తి జెఎన్‌ఎన్‌యూఆర్‌ఎం కాలనీకి చెందిన నూతలపాటి తేజ మూర్తి మద్యానికి బానిసై కుటుంబ సభ్యులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నారని వారి కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. దీనిపై వెంటనే స్పందించిన పోలీసు సిబ్బంది, కుటుంబ సభ్యుల సహకారంతో ఆయనను చినముషిడివాడలోని న్యూ లైఫ్ మత్తు విముక్తి పునరావాస కేంద్రంలో చేర్పించి చికిత్స అందేలా చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా పెందుర్తి పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, మద్యం, గంజాయి లేదా ఇతర మత్తు పదార్థాలకు బానిసై బాధపడుతున్న కుటుంబాల్లో ఎవరికైనా చికిత్స అవసరమైతే భయపడకుండా పోలీసులను సంప్రదించాలని సూచించారు. కుటుంబ సభ్యులు స్వచ్ఛందంగా సహాయం కోరిన వెంటనే స్పందించి, అవసరమైన సహకారం అందించి సంబంధిత పునరావాస కేంద్రాల్లో చేర్పించేందుకు పూర్తి సహాయం అందిస్తామని తెలిపారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండటం ద్వారా కుటుంబ బంధాలు కాపాడబడతాయని, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పెందుర్తి పోలీసులు పిలుపునిచ్చారు.

