ఆంధ్రప్రదేశ్–ఒడిశా సరిహద్దులోని కొటియా గ్రామాల విషయంలో మరోసారి వివాదం చెలరేగింది. జనగణన-2027 కోసం సమాచారం సేకరించేందుకు వెళ్లిన ఆంధ్రప్రదేశ్ సిబ్బందిని ఒడిశా అధికారులు అడ్డుకున్నట్లు సమాచారం. వివాదాస్పద గ్రామాల్లో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వివరాలు సేకరించగలిగారని అధికారులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ పరిధిలో ఉన్న గ్రామాలపై ఒడిశా ప్రభుత్వం కూడా పరిపాలనా చర్యలు చేపడుతుండటంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రెండు రాష్ట్రాల్లోనూ ఎన్డీయే ప్రభుత్వాలే అధికారంలో ఉన్నప్పటికీ, ఈ సరిహద్దు సమస్యకు ఇప్పటికీ పూర్తి పరిష్కారం లభించలేదు.

కొటియా గ్రామాల్లో జనగణన సేకరణపై ఆంధ్ర–ఒడిశా వివాదం