శ్రీ కాళహస్తి, మే 28, (పున్నమి న్యూస్) : ముస్లింలు అత్యంత పవిత్రంగా జరుపుకునే బక్రీద్ పండుగ త్యాగం, సేవాభావానికి ప్రతీక అని శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి పేర్కొన్నారు. బక్రీద్ సందర్భంగా ముస్లిం సోదరులు సంప్రదాయబద్ధంగా కుర్బానీలు నిర్వహిస్తూ పరమాత్మ పట్ల భక్తి, నిస్వార్థ త్యాగాన్ని చాటుకుంటారని ఆయన అన్నారు. నియోజకవర్గంలోని ముస్లిం సమాజానికి ఎమ్మెల్యే హృదయపూర్వక బక్రీద్ (ఈద్ ముబారక్) శుభాకాంక్షలు తెలియజేశారు. సమాజంలో సౌభ్రాతృత్వం, ఐక్యత, పరస్పర గౌరవం మరింత పెరగాలని ఆకాంక్షించారు. మహానాడు కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా అక్కడ హాజరైన ముస్లిం ప్రతినిధులను ప్రత్యేకంగా కలుసుకుని పండుగ శుభాకాంక్షలు అందజేశారు. ఈ సందర్భంగా మైనారిటీ సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనారిటీ కార్యనిర్వాహక కార్యదర్శి షాకీర్ అలీ, టౌన్ బ్యాంక్ చైర్మన్ ఖాదర్ భాషా, పట్టణ మైనార్టీ అధ్యక్షుడు కరీం, ఐటిడిపి నియోజకవర్గ అధ్యక్షుడు ఖాదర్, నియోజకవర్గ మైనారిటీ ప్రధాన కార్యదర్శి సి.ఎస్. మస్తాన్, అస్మత్తో పాటు పలువురు మైనారిటీ నాయకులు పాల్గొన్నారు.

బక్రీద్ త్యాగస్ఫూర్తికి ప్రతీక -ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి