Thursday, 28 May 2026
  • Home  
  • మన్నారు పోలూరులో 16 చక్రాల ట్రాలీ ఇరుక్కుపోవడంతో భారీ ట్రాఫిక్వెం టనే స్పందించిన ఎస్సై అజయ్ కుమార్
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మన్నారు పోలూరులో 16 చక్రాల ట్రాలీ ఇరుక్కుపోవడంతో భారీ ట్రాఫిక్వెం టనే స్పందించిన ఎస్సై అజయ్ కుమార్

సూళ్లూరుపేట నుంచి మన్నారుపోలూరు మీదుగా బుచ్చినాయుకండ్రిగకు వెళ్లే ప్రధాన రహదారిలో భారీ ట్రాఫిక్ అంతరాయం చోటుచేసుకుంది. మన్నారు పోలూరులోని ఆర్ఎంకె హైస్కూల్ పరిసర ప్రాంతంలో 16 చక్రాల భారీ ట్రాలీ వాహనం రోడ్డు ఇరువైపులా సరిగా నిర్మాణం పూర్తికాని డ్రైనేజీ కాలువలో ఇరుక్కుపోవడంతో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.ఈ ఘటనతో రహదారిపై రెండు వైపులా భారీగా వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా పాఠశాల ప్రాంతం కావడంతో విద్యార్థులు, ఉద్యోగులు, స్థానిక ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. రోడ్డు పక్కన నిర్మాణం పూర్తికాని డ్రైనేజీ కాలువల కారణంగానే ఈ ప్రమాదం చోటుచేసుకుందని స్థానికులు ఆరోపిస్తున్నారు.సమాచారం అందుకున్న వెంటనే సూళ్లూరుపేట ఎస్సై అజయ్ కుమార్ సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. అనంతరం జెసిబి సహాయంతో ట్రాలీని బయటకు తీసేందుకు చర్యలు చేపట్టి ట్రాఫిక్‌ను నియంత్రించారు. పోలీసులు వేగంగా స్పందించడంతో కొంతసేపటి తర్వాత వాహనాల రాకపోకలు సాధారణ స్థితికి చేరుకున్నాయి.రోడ్డు పక్కన ప్రమాదకరంగా మారిన డ్రైనేజీ నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.