Thursday, 28 May 2026
  • Home  
  • డబుల్ బెడ్ రూమ్ లాటరీ విధానాన్ని రద్దు చేయాలి – సిపిఐ
- ఆదిలాబాదు

డబుల్ బెడ్ రూమ్ లాటరీ విధానాన్ని రద్దు చేయాలి – సిపిఐ

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో సిపిఐ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన పత్రిక సమావేశంలో జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ గత పది సంవత్సరాల నుండి డబుల్ బెడ్రూమ్స్ ఇవ్వకుండా సడన్గా ప్రస్తుతం లాటరీ ద్వారా ఇస్తామనడం పక్షపాతంగా ఉందని అన్నారు. గతంలో ఇండ్లు ఇప్పిస్తామని చెప్పి పలువురు మధ్యవర్తులు 50 వేల నుంచి లక్ష రూపాయల వరకు తీసుకొని బయటపడ్డారని, అలాంటి పరిస్థితుల్లో లాటరీ విధానం రద్దు చేసి మళ్లీ ఫ్రెష్ గా, వార్డు సభల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేయాలని గతంలో జిల్లా కలెక్టర్ గారి దృష్టికి సిపిఐ పార్టీగా తీసుకువెళ్లడం జరిగిందన్నారు. ఇండ్లు లేని పేదలకు, వికలాంగులకు, ఒంటరి స్త్రీలకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. లేని పక్షంలో భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కుంటల రాములు, సిపిఐ పట్టణ కార్యదర్శి ఎస్ అరుణ్ కుమార్, బీహెచ్పీఎస్ జిల్లా అధ్యక్షులు రామదాసు, గిరిజన సంఘం జిల్లా నాయకులు కడప సురేష్, పట్టణ సహాయ కార్యదర్శి తబ్రేజ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.