పద్య కవిత్వంలో అసామాన్య ప్రతిభ మధురకవి మల్లవరపు జాన్ కవి సొంతమని కేంద్ర సాహిత్య అకాడెమీ తెలుగు విభాగం కన్వీనర్ ఆచార్య సి.మృణాళిని పేర్కొన్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ, జానుడి- సెంటర్ ఫర్ లిటరేచర్ అండ్ ఆర్ట్స్ సంయుక్త ఆధ్వర్యంలో మధురకవి జాన్ శతజయంతి సదస్సు ఒంగోలు మల్లయ్య లింగం భవన్లో నిర్వహించారు. ఉదయం నుండి సాయంత్రం వరకు జాన్ కవి రచించిన పలు పుస్తకాలపై సాహిత్య పరిశోధకులు పత్ర సమర్పణలు చేయగా , స్వాగత ఉపన్యాసం ఆచార్య మృణాళిని చేశారు . ఈ ప్రారంభ సదస్సు జానుడి సాహిత్య సంస్థ ప్రధాన కార్యదర్శి డాక్టర్ నూకతోటి రవికుమార్ అధ్యక్షత వహించగా కీలక ఉపన్యాసం ప్రముఖ సాహితీవేత్త , కవి డాక్టర్ కోయి కోటేశ్వరరావు మధురకవి మల్లవరపు జాన్ కవిత్వం లోని అనేక అంశాలను విశదం చేశారు. గుర్రం జాషువా సమకాలికుడిగా జాన్ కవి మన ప్రాంత అస్తిత్వాన్ని విశ్వవ్యాప్తం చేసి చీమకుర్తికి సముచిత గౌరవాన్ని కల్పించాడని అన్నారు . వేరు వేరు సదస్సులలో ప్రముఖ వైద్యులు డాక్టర్ జవహర్, గెలాక్సీ గ్రానైట్ అధినేత చలువాది బదిరీనారాయణ, ప్రముఖ నాటక రచయిత పాటిబండ్ల ఆనందరావు, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఆచార్యులు డాక్టర్ దార్ల వెంకటేశ్వరరావు, మద్రాస్ విశ్వవిద్యాలయం ఆచార్యులు డాక్టర్ విస్తాలి శంకరరావు, విజయవాడ లయోలా కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ వై విజయానంద రాజు, ప్రముఖ కవి కొండ్రెడ్డి వెంకటేశ్వర రెడ్డి, డాక్టర్ బీరం సుందర రావు, సాహితీవేత్త డాక్టర్ కప్పగంతుల మధుసూదన శాస్త్రి తదితరులు ప్రసంగించగా, అతిధులుగా వాణిజ్య పన్నుల శాఖ జాయింట్ కమిషనర్ మల్లవరపు సుధాకర్ రావు , మల్లవరపు ప్రభాకర రావు , తేళ్ల మనోజ్ కుమార్, జానుడి అధ్యక్షుడు ఎద్దు విజయకుమార్ లు పాల్గొన్నారు. అనంతరం జరిగిన స్థానిక సాహిత్య సంస్థల సభలో పి.రాజ్యలక్ష్మి, కే.అనిల కుమార్ సూరి,( సృజన), ప్రముఖ కవి కత్తి కళ్యాణ్, చప్పిడి కోటేశ్వరరావు, తంగిరాలసోని, పలు సాహిత్య సంస్థల ప్రతినిధులు పాల్గొనగా ఈ కార్యక్రమంలో ‘సూక్తి శతకం’ పద్య పోటీలో విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు. పెద్ద ఎత్తున సాహిత్య అభిమానులు, జాన్ కవి శిష్యులు పాల్గొన్నారు.



