Monday, 13 July 2026
  • Home  
  • తాగునీటి సమస్యపై అధికారుల నిర్లక్ష్యం.. మున్సిపల్ కమిషనర్‌కు వైఎస్సార్సీపీ వినతి
- News - ఆంధ్రప్రదేశ్ - శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

తాగునీటి సమస్యపై అధికారుల నిర్లక్ష్యం.. మున్సిపల్ కమిషనర్‌కు వైఎస్సార్సీపీ వినతి

రెండు రోజుల్లో సమస్య పరిష్కరించకపోతే మున్సిపాలిటీ ముట్టడిస్తామని హెచ్చరిక ఆత్మకూరు, జూలై 14 (హరికిరణ్, పున్నమి ప్రతినిధి): ఆత్మకూరు పట్టణంలో గత రెండు వారాలుగా నెలకొన్న తాగునీటి సంక్షోభం అధికారుల నిర్లక్ష్యం, ముందస్తు ప్రణాళికల లోపానికి నిదర్శనమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపించారు. ఉత్తర కాలువ మరమ్మతుల కారణంగా నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని మూడు నెలల ముందే తెలిసినా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని విమర్శించారు. ఈ నేపథ్యంలో సోమవారం వైఎస్సార్సీపీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నాయకులు మున్సిపల్ కమిషనర్ గంగాప్రసాద్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా పార్టీ పట్టణ అధ్యక్షుడు నాగులపాటి ప్రతాప్ రెడ్డి, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి కొండా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పట్టణంలోని 23 వార్డుల ప్రజలు గుక్కెడు తాగునీటి కోసం తీవ్ర అవస్థలు పడుతున్నారని అన్నారు. మహిళలు బిందెలతో గంటల తరబడి నీటి కోసం వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొన్నప్పటికీ అధికారులు మాత్రం స్పందించడంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు.ఉత్తర కాలువ మరమ్మతుల కారణంగా ప్రధాన నీటి సరఫరా నిలిచిపోతుందని ముందుగానే తెలిసినా ప్రత్యామ్నాయ నీటి సరఫరా వ్యవస్థను సిద్ధం చేయలేదని పేర్కొన్నారు. అప్పారావుపాళెం నుంచి ఆరు వార్డులకు సరఫరా చేస్తున్న పెన్నా నది నీటిని అవసరాన్ని బట్టి మరిన్ని వార్డులకు విస్తరించే అవకాశం ఉన్నప్పటికీ ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయ వనరులను కూడా సమర్థంగా వినియోగించకపోవడం, పైపులైన్ ద్వారా జరిగే సరఫరాను నిలిపివేయడం వల్ల సమస్య మరింత తీవ్రతరమైందన్నారు. దీంతో పట్టణ ప్రజలు తాగునీటి కోసం నానా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు కనీస అవసరమైన తాగునీటిని కూడా అందించలేని పరిస్థితి మున్సిపల్ పాలన వైఫల్యానికి నిదర్శనమని నాయకులు మండిపడ్డారు. నీటి కొరత కారణంగా స్వచ్ఛభారత్ మిషన్ కింద నిర్మించిన మరుగుదొడ్లను కూడా ప్రజలు వినియోగించలేకపోతున్నారని, దీంతో పారిశుద్ధ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత ఇంత తీవ్రమైన తాగునీటి సంక్షోభాన్ని ప్రజలు ఎన్నడూ ఎదుర్కోలేదని పేర్కొన్నారు.ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాపైనే ఆధారపడే పరిస్థితిని తీసుకొచ్చి అధిక వ్యయాలకు అవకాశం కల్పిస్తున్నారనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయని అన్నారు. ప్రతి వార్డుకు ప్రతిరోజూ సురక్షితమైన తాగునీరు అందేలా అత్యవసర చర్యలు చేపట్టాలని కమిషనర్‌ను కోరారు.సమస్యను యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలని, లేకపోతే ప్రజల్లో అసంతృప్తి మరింత పెరుగుతుందని హెచ్చరించారు. మరో రెండు రోజుల్లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపకపోతే మహిళలు, ప్రజలతో కలిసి మున్సిపాలిటీ కార్యాలయాన్ని ముట్టడించి ఆందోళన చేపడతామని వైఎస్సార్సీపీ నాయకులు స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు డాక్టర్ సీహెచ్ ఆదిశేషయ్య, పట్టణ ఉపాధ్యక్షులు అండ్రా సుబ్బారెడ్డి, తోడేటి మణి, ఇందూరు సురేంద్రరెడ్డి, నోటి వినయ్‌కుమార్‌రెడ్డి, నియోజకవర్గ క్రిస్టియన్ సెల్ అధ్యక్షుడు నందవరం ప్రసాద్, పట్టణ మైనారిటీ అధ్యక్షుడు మీరా మొహిద్దీన్, ముజీబుల్లా, షేక్ రహీం, షేక్ పర్వీన్, పట్టణ యువత అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం రెడ్డి, కార్యవర్గ సభ్యులు సుబ్బారెడ్డి, నారాయణరెడ్డి, బ్రహ్మనాయుడు, వెంకటేశ్వర్లు, వెంగళరెడ్డి, జనార్ధన్‌రెడ్డి, జమ్రు, మల్లికార్జున, షారూక్, యర్రగుంట్ల మల్లికార్జున, యడ్ల విష్ణు, బాలచెన్నయ్య, యానాదిరెడ్డి, యస్థాని, చైతన్య తదితరులు పాల్గొన్నారు.

రెండు రోజుల్లో సమస్య పరిష్కరించకపోతే మున్సిపాలిటీ ముట్టడిస్తామని హెచ్చరిక

ఆత్మకూరు, జూలై 14 (హరికిరణ్, పున్నమి ప్రతినిధి):

ఆత్మకూరు పట్టణంలో గత రెండు వారాలుగా నెలకొన్న తాగునీటి సంక్షోభం అధికారుల నిర్లక్ష్యం, ముందస్తు ప్రణాళికల లోపానికి నిదర్శనమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపించారు. ఉత్తర కాలువ మరమ్మతుల కారణంగా నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని మూడు నెలల ముందే తెలిసినా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని విమర్శించారు. ఈ నేపథ్యంలో సోమవారం వైఎస్సార్సీపీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నాయకులు మున్సిపల్ కమిషనర్ గంగాప్రసాద్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా పార్టీ పట్టణ అధ్యక్షుడు నాగులపాటి ప్రతాప్ రెడ్డి, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి కొండా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పట్టణంలోని 23 వార్డుల ప్రజలు గుక్కెడు తాగునీటి కోసం తీవ్ర అవస్థలు పడుతున్నారని అన్నారు. మహిళలు బిందెలతో గంటల తరబడి నీటి కోసం వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొన్నప్పటికీ అధికారులు మాత్రం స్పందించడంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు.ఉత్తర కాలువ మరమ్మతుల కారణంగా ప్రధాన నీటి సరఫరా నిలిచిపోతుందని ముందుగానే తెలిసినా ప్రత్యామ్నాయ నీటి సరఫరా వ్యవస్థను సిద్ధం చేయలేదని పేర్కొన్నారు. అప్పారావుపాళెం నుంచి ఆరు వార్డులకు సరఫరా చేస్తున్న పెన్నా నది నీటిని అవసరాన్ని బట్టి మరిన్ని వార్డులకు విస్తరించే అవకాశం ఉన్నప్పటికీ ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయ వనరులను కూడా సమర్థంగా వినియోగించకపోవడం, పైపులైన్ ద్వారా జరిగే సరఫరాను నిలిపివేయడం వల్ల సమస్య మరింత తీవ్రతరమైందన్నారు. దీంతో పట్టణ ప్రజలు తాగునీటి కోసం నానా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రజలకు కనీస అవసరమైన తాగునీటిని కూడా అందించలేని పరిస్థితి మున్సిపల్ పాలన వైఫల్యానికి నిదర్శనమని నాయకులు మండిపడ్డారు. నీటి కొరత కారణంగా స్వచ్ఛభారత్ మిషన్ కింద నిర్మించిన మరుగుదొడ్లను కూడా ప్రజలు వినియోగించలేకపోతున్నారని, దీంతో పారిశుద్ధ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత ఇంత తీవ్రమైన తాగునీటి సంక్షోభాన్ని ప్రజలు ఎన్నడూ ఎదుర్కోలేదని పేర్కొన్నారు.ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాపైనే ఆధారపడే పరిస్థితిని తీసుకొచ్చి అధిక వ్యయాలకు అవకాశం కల్పిస్తున్నారనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయని అన్నారు. ప్రతి వార్డుకు ప్రతిరోజూ సురక్షితమైన తాగునీరు అందేలా అత్యవసర చర్యలు చేపట్టాలని కమిషనర్‌ను కోరారు.సమస్యను యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలని, లేకపోతే ప్రజల్లో అసంతృప్తి మరింత పెరుగుతుందని హెచ్చరించారు. మరో రెండు రోజుల్లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపకపోతే మహిళలు, ప్రజలతో కలిసి మున్సిపాలిటీ కార్యాలయాన్ని ముట్టడించి ఆందోళన చేపడతామని వైఎస్సార్సీపీ నాయకులు స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు డాక్టర్ సీహెచ్ ఆదిశేషయ్య, పట్టణ ఉపాధ్యక్షులు అండ్రా సుబ్బారెడ్డి, తోడేటి మణి, ఇందూరు సురేంద్రరెడ్డి, నోటి వినయ్‌కుమార్‌రెడ్డి, నియోజకవర్గ క్రిస్టియన్ సెల్ అధ్యక్షుడు నందవరం ప్రసాద్, పట్టణ మైనారిటీ అధ్యక్షుడు మీరా మొహిద్దీన్, ముజీబుల్లా, షేక్ రహీం, షేక్ పర్వీన్, పట్టణ యువత అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం రెడ్డి, కార్యవర్గ సభ్యులు సుబ్బారెడ్డి, నారాయణరెడ్డి, బ్రహ్మనాయుడు, వెంకటేశ్వర్లు, వెంగళరెడ్డి, జనార్ధన్‌రెడ్డి, జమ్రు, మల్లికార్జున, షారూక్, యర్రగుంట్ల మల్లికార్జున, యడ్ల విష్ణు, బాలచెన్నయ్య, యానాదిరెడ్డి, యస్థాని, చైతన్య తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.