అనంతపురం శివారు కమలానగర్ ప్రాంతంలో గంజాయి విక్రయిస్తున్న 14 మంది ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 7 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గుంతకల్లు రైల్వే స్టేషన్ ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తి నుంచి కిలో రూ.10 వేల చొప్పున సురేష్ అనే ప్రధాన నిందితుడు దీనిని కొనుగోలు చేశాడు. ఆపై మహిళలతో కలిపి మొత్తం 14 మంది ద్వారా చిన్న పొట్లాలుగా చేసి అనంతపురంలోని పలు ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు జిల్లా ఎస్పీ జగదీష్ వివరాలు వెల్లడించారు.

7 కేజీల గంజాయి స్వాధీనం.| మహిళలతో సహా ముఠా అరెస్ట్