న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌లోని ఎగువ గంగా పరివాహక ప్రాంతాల్లో కొత్త జలవిద్యుత్ ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వబోమని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు స్పష్టం చేసింది. పర్యావరణ పరిరక్షణ, భూకంపాల ప్రమాదం, ఆకస్మిక వరదల ముప్పు వంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. గంగా నది సహజ ప్రవాహం, జీవ వైవిధ్యం కాపాడటమే ప్రధాన ఉద్దేశమని పేర్కొంది. అయితే ఇప్పటికే నిర్మాణ దశలో ఉన్న లేదా ప్రారంభమైన కొన్ని ప్రాజెక్టులకు ప్రత్యేక మినహాయింపులు ఇచ్చినట్లు కేంద్రం వెల్లడించింది.

గంగా ప్రాజెక్టులకు బ్రేక్ : కేంద్ర ప్రభుత్వం