బిజినేపల్లి: బిజినేపల్లి మండలం మంగనూరు జిల్లా పరిషత్ హైస్కూల్లో పీఎం శ్రీ పథకం ఆధ్వర్యంలో వేసవి ప్రత్యేక శిబిరాన్ని (సమ్మర్ క్యాంప్) మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయురాలు (పీడీ) అలివేలమ్మ మాట్లాడుతూ.. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధే ధ్యేయంగా ఈ శిబిరం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. క్యాంపులో బోధించే యోగా, స్పోకెన్ ఇంగ్లీష్, సాంస్కృతిక అంశాలను విద్యార్థులు శ్రద్ధతో నేర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
Uploaded Video:

