
విశాఖపట్నం మే19(పున్నమి ప్రతినిధి వి సతీష్ కుమార్):
వై యస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దళితులపై ఎన్నో అరాచకాలు చేసి, ఇప్పుడు నా దళితులంటూ కపట ప్రేమను ప్రదర్శిస్తున్నారని విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం శాసన సభ్యులు పి గణబాబు ధ్వజమెత్తారు. విశాఖపట్నం శివారు గోపాలపట్నంలో గల పశ్చిమ నియోజకవర్గం కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో గణబాబు మాట్లాడారు. అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్ డెలివరీ చేసినా కనీసం చర్య తీసుకోకుపోగా అనంత బాబుకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి వెంట తిప్పుకున్న ఘనత జగన్ దేనిని విమర్శించారు. అలాగే మాస్కులు కోసం అడిగిన దళితుడైన డాక్టర్ సుధాకర్ ను ఎన్నో చిత్రహింసలు పెట్టి నడిరోడ్డుపై విచక్షణరహితంగా కొట్టి చంపారని ఆరోపించారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య జరిగి ఈ ఏడాది మే 19 కి ఐదు సంవత్సరాలు అయిందని,ళ అలాగే వచ్చేనెల 21 కి సుధాకర్ మృతి చెంది ఐదేళ్లవుతోందని గణబాబు అన్నారు. వీరికి నివాళులర్పించే కార్యక్రమాన్ని అలాగే వారి కుటుంబాలకి ధైర్యాన్ని భరోసాని ఇచ్చే విధంగా కార్యక్రమాన్ని చేపట్టినట్లు గణబాబు వివరించారు. అలాగే చంద్రబాబు నాయుడు 2014-19 పాలనలో దళితులపై దౌర్జన్యాలు, దాడులు కేసులు సుమారు 8000 నమొదు కాగా, తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి హయాంలో 50 వేలకు పైగా కేసులు నమోదయ్యాయని గణబాబు చెప్పారు. అలాగే ఎస్సీ ఎస్టీల కోసం కేటాయించిన సబ్ ప్లాన్ నిధులు సుమారు 32 వేల కోట్లను దారి మళ్ళించి ఎస్సీ ఎస్టీలకు జగన్మోహన్ రెడ్డి మొండిచేయి చూపారని గణబాబు అన్నారు. అధికారం పోయినా వైసిపి నాయకులు దళితులపై దాడులు ఆపడం లేదని గణబాబు ద్వజమెత్తారు. కడపలో పశువుల డాక్టర్ అచ్చన్న, ఎంపీడీవో జవహార్ తదితరులు పై ఇంకా దౌర్జన్యాలు వైసిపి నాయకులు కొనసాగిస్తున్నారని అన్నారు. కూటమి పాలనలో దళితులకు అన్ని విధాలుగా న్యాయం జరుగుతుందని దాని తగినట్టు కార్యాచరణ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తోపుకల్పం చేసారని గణబాబు చెప్పారు. ఇంత చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి దళితుల పట్ల కపట ప్రేమను ప్రదర్శిస్తూ మొసలి కన్నీరు కారుస్తున్నారని గణబాబు చేశారు. అలాగే కోడి కత్తి శ్రీనుకు ఐదేళ్లు బెయిల్ రాకుండా అడ్డుకున్నారని అన్నారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం, డాక్టర్ సుధాకర్ ల మృతి చెంది ఐదేళ్లు పూర్తి అవుతున్న సందర్భంగా ఏ దళితుడికి భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా ఉండేందుకు చైతన్యవంత కార్యక్రమాలను చేపడతామని గణబాబు చెప్పారు

