Monday, 18 May 2026
  • Home  
  • శ్రీకాళహస్తీశ్వర స్వామిని దర్శించుకున్న రాష్ట్ర హోంమంత్రి
- తిరుపతి

శ్రీకాళహస్తీశ్వర స్వామిని దర్శించుకున్న రాష్ట్ర హోంమంత్రి

శ్రీకాళహస్తి, మే 18, (పున్నమి టెంపుల్ న్యూస్): శ్రీకాళహస్తి నియోజకవర్గ పర్యటనలో భాగంగా రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత సోమవారం శ్రీకాళహస్తీశ్వర ఆలయంను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణానికి చేరుకున్న మంత్రికి స్థానిక ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. మంత్రి అనిత శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. దర్శనానంతరం వేద పండితులు ఆశీర్వచనాలు అందించగా, ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను సమర్పించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆ ముక్కంటి స్వామిని ప్రార్థించినట్లు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా ఎస్పీ, రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, వివిధ శాఖల అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.