

విశాఖపట్నం మే18(పున్నమి ప్రతినిధి వి సతీష్ కుమార్):మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ(జివిఎంసి) వార్డుల విభజన ప్రక్రియ పూర్తైంది. ప్రస్తుతం ఉన్న 98 వార్డులను ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు120కి పెంచుతూ డ్రాఫ్ట్ పబ్లికేషన్ సిద్ధం చేశారు. సోమవారం నుంచి వార్డుల సరిహద్దులు, జనాభా వివరాలను జివిఎంసి ప్రధాన కార్యాలయం, జోనల్ కార్యాలయాల్లో ప్రదర్శించనున్నారు. ప్రజల నుంచి వారం రోజుల పాటు అభ్యంతరాలు స్వీకరించి ప్రభుత్వానికి నివేదిక పంపిస్తారు. పెరుగుతున్న వార్డులకనుగుణంగా 8 జోనల్ కార్యాలయా లను 10 కి పెంచారు. భీమిలి, అగనంపూడి జోన్లు 5 వార్డులతో చిన్నవి కాగా, విశాఖపట్నం ఉత్తర జోన్ అధికంగా 20వాలర్డులు కలిగి ఉంది. అభ్యంతరాల అనంతరం ఇవి 150వార్డుల వరకు పెరిగే అవకాశం ఉంది.

