ప్లాస్టిక్ వ్యర్థాలకు బదులుగా నిత్యావసర సరుకులు అందించే వినూత్న కార్యక్రమాన్ని నంద్యాల జిల్లా యంత్రాంగం ప్రారంభించింది. ‘క్లీన్ నంద్యాల’ లక్ష్యంతో ‘స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమంలో భాగంగా వేస్ట్ ప్లాస్టిక్ ఎక్స్చేంజ్ సెంటర్‌ను మంత్రి ఎన్.ఎం.డి. ఫరూక్, కలెక్టర్ రాజకుమారి గనియా ప్రారంభించారు. ఈ కేంద్రంలో ఒక కిలో ప్లాస్టిక్ వ్యర్థాలు జమ చేస్తే ఒక కిలో చక్కెర లేదా సేమ్యా లేదా ఆరు గుడ్లు అందిస్తారు. ప్లాస్టిక్‌ను కాల్చడం, బహిరంగ ప్రదేశాల్లో పడేయడం పర్యావరణానికి హానికరమని మంత్రి హెచ్చరించారు. డ్రైన్లలో చెత్త వేసేవారిపై సీసీ కెమెరాల ద్వారా నిఘా పెట్టి జరిమానాలు విధిస్తామని తెలిపారు.

క్లీన్ నంద్యాల’ లక్ష్యంతో ‘స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర