Saturday, 16 May 2026
  • Home  
  • జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ కమిటీ నాన్ ఎస్సీ సభ్యుడిగా పెంటగట్ల మణికుమార్
- తూర్పు గోదావరి

జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ కమిటీ నాన్ ఎస్సీ సభ్యుడిగా పెంటగట్ల మణికుమార్

తూర్పు గోదావరి జిల్లా పున్నమి ప్రతినిధి ✍️ సిరిసిపల్లి చిన్న రమేష్ బాబు న్యూస్ రిపోర్టర్. తూర్పుగోదావరి, 16 మే (పున్నమి ప్రతినిధి) : తూర్పుగోదావరి జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ నాన్ ఎస్సీ సభ్యులుగా సామాజిక సేవకుడు, పవన్ కళ్యాణ్ ఛారటబుల్ ట్రస్ట్ చైర్మన్ పెంటగట్ల మణికుమార్ నియమితులయ్యారు. ఈమేరకు జిల్లా కలెక్టర్ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. వీరు రెండు ఏళ్లపాటు ఈ పదవిలో కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మణికుమార్ మాట్లాడుతూ షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ తెగలు (అత్యాచారాల నివారణ) చట్టం,1989 అమలు చేసేందుకు కృషి చేస్తామన్నారు. బాధితులకు అందించే ఉపశమన మరియు పునరావాస సౌకర్యాలు, చట్టం కింద నమోదైన కేసుల న్యాయ విచారణ (ప్రాసిక్యూషన్) పురోగతి పై కమిటీలో చర్చిస్తామన్నారు. చట్టంలోని నిబంధనలను అమలు చేయడానికి బాధ్యత వహించే వివిధ అధికారుల పాత్రను మరియు సంబంధిత అధికారుల నుండి అందిన వివిధ నివేదికలను జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగే సమావేశంలో సమీక్షిస్తారన్నారు. ఈసందర్భంగా స్వచ్చంద సంస్థలు ప్రతినిధులు, పలువురు న్యాయవాదులు, ప్రభుత్వ అధికారులు మణికుమర్ ని అభినందించారు.

తూర్పు గోదావరి జిల్లా
పున్నమి ప్రతినిధి
✍️ సిరిసిపల్లి చిన్న రమేష్ బాబు
న్యూస్ రిపోర్టర్.

తూర్పుగోదావరి, 16 మే (పున్నమి ప్రతినిధి) :
తూర్పుగోదావరి జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ నాన్ ఎస్సీ సభ్యులుగా సామాజిక సేవకుడు, పవన్ కళ్యాణ్ ఛారటబుల్ ట్రస్ట్ చైర్మన్ పెంటగట్ల మణికుమార్ నియమితులయ్యారు. ఈమేరకు జిల్లా కలెక్టర్ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. వీరు రెండు ఏళ్లపాటు ఈ పదవిలో కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మణికుమార్ మాట్లాడుతూ షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ తెగలు (అత్యాచారాల నివారణ) చట్టం,1989 అమలు చేసేందుకు కృషి చేస్తామన్నారు. బాధితులకు అందించే ఉపశమన మరియు పునరావాస సౌకర్యాలు, చట్టం కింద నమోదైన కేసుల న్యాయ విచారణ (ప్రాసిక్యూషన్) పురోగతి పై కమిటీలో చర్చిస్తామన్నారు. చట్టంలోని నిబంధనలను అమలు చేయడానికి బాధ్యత వహించే వివిధ అధికారుల పాత్రను మరియు సంబంధిత అధికారుల నుండి అందిన వివిధ నివేదికలను జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగే సమావేశంలో సమీక్షిస్తారన్నారు. ఈసందర్భంగా స్వచ్చంద సంస్థలు ప్రతినిధులు, పలువురు న్యాయవాదులు, ప్రభుత్వ అధికారులు మణికుమర్ ని అభినందించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.