శ్రీ కాళహస్తి, మే 15 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి పట్టణంలోని స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో బియ్యపు మధుసూదన్ రెడ్డి జన్మదిన వేడుకలు నియోజిక వర్గ మాజీ శాసన నసభ సబ్యులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, నియోజకవర్గ ప్రజలు పెద్ద ఎత్తున హాజరై ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. “పోయింది అధికారమే కానీ అభిమానం కాదు” అన్నట్లుగా వేడుకలు ఉత్సాహభరితంగా సాగాయి. ఈ సందర్భంగా మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం సహా పలువురు పార్టీ నాయకులు మధుసూదన్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు అందజేశారు. జన్మదినం సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం పార్టీ కార్యాలయం వద్ద అభిమానులు, నాయకుల కోసం భారీగా భోజన ఏర్పాట్లు చేయగా, మధుసూదన్ రెడ్డి అందరితో కలిసి భోజనం చేశారు. కార్యక్రమంలో పలువురు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

శ్రీకాళహస్తిలో వైభవంగా మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి జన్మదిన వేడుకలు